Whats App New Feature: ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వినియోగంలో ఉన్న మెసేజింగ్‌ యాప్ వాట్సప్‌. ఈ స్మార్ట్‌ ఫోన్‌ యుగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వాట్సప్‌ కొత్త కొత్త ఫీచర్స్ ను తీసుకు వస్తూ ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త అనుభూతిని మరియు మరింత సౌకర్యంను అందిస్తూనే ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకప్పడు కేవలం టెక్ట్స్ మెసేజ్ లకు మాత్రమే పరిమితం అయిన వాట్సప్‌ లో ఇప్పుడు ఏ స్థాయి ఫీచర్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాట్సప్‌ లో వీడియో కాలింగ్ వచ్చిన సమయంలో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకు మించి వాట్సప్ నుండి ఏమీ అక్కర్లేదు అనుకున్నారు. కానీ ఎప్పటికప్పడు వాట్సప్‌ వినియోగదారులు కోరుకోని ఫీచర్స్‌ ను కూడా తీసుకు వచ్చి అత్యధికులు వినియోగించే మెసేజింగ్‌ యాప్ గా నిలిచింది. 


ఈ మధ్య కాలంలో జీమ్‌ మరియు గూగుల్ మీట్ లో స్క్రీన్ షేరింగ్ ఆప్షన్‌ వినియోగదారులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. దాంతో ఆ ఆప్షన్ ను వాట్సప్ వీడియో కాల్ లేదా వాట్సప్ గ్రూప్ కాల్‌ లో కూడా ఉంటే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. తాజా అప్డేట్‌ లో వాట్సప్‌ ఆ ఫీచర్ ను తీసుకు వచ్చింది. 


ప్రస్తుతం బీటా వార్షన్ లో అందుబాటులో ఉన్న స్క్రీనింగ్ షేరింగ్ ఆప్షన్‌ ను అతి త్వరలోనే అందరికి కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. వాట్సప్‌ లో స్క్రీన్‌ షేరింగ్ బటన్ ను చేర్చడం జరిగింది. ఆ విషయమై ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫీచర్‌ లో ఉన్న సెక్యూరిటీ లోపాలను గురించి ప్రస్తుతం పరీక్షిస్తున్నట్లుగా వాట్సప్‌ పేర్కొంది. 


Also Read: CSK Vs GT IPL 2023: క్షణాల్లో మ్యాచ్‌ మార్చేసే వీరులు.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి..!  


వీడియో కాలింగ్‌ సమయంలో స్క్రీన్‌ షేరింగ్ బటన్ కింద ఇవ్వడం జరిగింది. స్క్రీన్‌ షేరింగ్ ఆప్షన్‌ తో సైబర్‌ నేరాలకు పాల్పడే వారికి అదును అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాట్సప్‌ పై ఉంది. గూగుల్‌ మీట్ మరియు జూమ్‌ మీటింగ్ లో ఉన్న స్క్రీన్‌ షేరింగ్‌ ఆప్షన్‌ కు కాస్త విభిన్నంగా ఈ షేరింగ్ ఆప్షన్‌ ఉంటుందని.. అవతలి వారి యొక్క స్క్రీన్‌ ను చూడాలి అంటే కచ్చితంగా అవతలి వ్యక్తి యొక్క మొబైల్‌ నుండి యాక్సెస్ తప్పనిసరిగా ఉండాల్సిందే. 


గ్రూప్‌ మీటింగ్స్ లో ఈ స్క్రీన్‌ షేరింగ్ ఆప్షన్‌ ఎక్కువగా ఉపయోగపడుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. కంప్యూటర్ లోనే కాకుండా మొబైల్ లో కూడా స్క్రీన్‌ షేరింగ్ ఆప్షన్ ను వినియోగించే అవకాశం ఉంటుంది. ఈ స్క్రీన్‌ షేరింగ్‌ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెళ్లడించే అవకాశాలు ఉన్నాయి.


Also Read: Sharwanand accident: శర్వానంద్ కారుకు యాక్సిడెంట్.. గాయాలతో హాస్పటల్‌కు?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి