Google imposed New Guidelines for Personal Loans Apps from May 31 2023: వ్యక్తిగత గోప్యతకు సంబంధించి గూగుల్ ఇక నుంచి నిబంధనలు కఠినతరం చేసింది. ఈ మేరకు ఫైనాన్షియల్ సర్వీసెస్ పాలసీని విడుదల చేసింది. మోసపూరిత, ప్రమాదకర ఆర్థిక ఉత్పత్తులు లేదా సేవలకు వినియోగదారుల వ్యక్తి సమాచారాన్ని బహిర్గతం చేయడం విషయంలో కఠిన మార్గదర్శకాలను అమలు చేయనుంది. నేటి నుంచి కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. ఈ నిబంధనల ప్రకారం ఏదైనా యాప్ మీ నుంచి వ్యక్తిగత వివరాలను తీసుకోదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తద్వారా స్కామ్‌ల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న ఆన్‌లైన్ లోన్ ఇచ్చే యాప్‌ల డేటాను గూగుల్ తొలగించనుంది. ఈ యాప్‌లను ఉపయోగించే వ్యక్తులు, వారి ఫోన్‌లో దానికి సంబంధించిన వ్యక్తిగత డేటా, తమ డేటాను భద్రపరచడానికి లేదా డేటాను తొలగించడానికి జాగ్రత్త తీసుకోవడం మంచిది. బుధవారం నుంచి ఈ డేటాను ఆటోమేటిక్‌గా తొలగించనుంది.


పర్సనల్ లోన్లు ఇచ్చే యాప్‌లు యాక్సెస్‌ను సులభతరం చేసే  ఉద్దేశంతో ఫోటోలు, కాంటాక్ట్స్  సున్నితమైన డేటాను యాక్సెస్ సేకరిస్తున్నాయి. దీంతో తిరిగి లోన్లు చెల్లించని సమయంలో వినియోగదారులు వ్యక్తిగత సమాచారాన్ని యాప్‌లు సేకరించి.. వేధింపులకు గురిచేస్తున్నాయని గూగుల్ చెబుతోంది. యూజర్లకు సంబంధించి ఫొటోలు, ఫోన్ నంబర్లు, లోకేషన్ వంటి వివరాలను లోన్ యాప్‌లు సేకరిస్తున్నాయిని పేర్కొంది. 


Also Read: 7th Pay Commission: అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్


గుగూల్ తీసుకువచ్చిన కొత్త పాలసీ విధానం పర్సనల్ లోన్ యాప్‌లు, థర్డ్ పార్టీ రుణదాతలతో వినియోగదారులను కనెక్ట్ చేసే యాప్‌లకు వర్తిస్తుంది. పర్సనల్ లోన్ యాప్‌ల నుంచి కేంద్ర ప్రభుత్వం కీలక డాక్యుమెంట్లను కోరింది. యాప్‌లు ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించకపోతే.. వాటిపై బ్యాన్ విధించనున్నారు. 


గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న లెండింగ్ యాప్‌లను మూసివేందుకు వ్యక్తిగత రుణ విధానాన్ని అప్‌డేట్ చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం.. యాప్‌లు ఇకపై వినియోగదారుల నుంచి ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్స్, లొకేషన్, కాల్ లాగ్‌లను యాక్సెస్ చేయలేవు. యాప్‌ల నుంచి వినియోగదారుల గోప్యతను రక్షించడానికి గూగుల్ ప్రయత్నిస్తోంది.  


Also Read: Adipurush Rights: చివరి నిముషంలో ప్రభాస్ ప్రాజెక్టుల నుంచి యూవీ క్రియేషన్స్ ఔట్.. అసలు విషయం ఏంటంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook