Google Search Tips: ప్రస్తుతం గూగుల్ అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజిన్. ఏదైనా విషయం తెలుసుకోవాలంటే.. ముందు గూగుల్‌ వైపే మన వేళ్లు వెళతాయి. అయితే గూగుల్‌లో అన్ని విషయాల కోసం సెర్చ్ చేయకూడదు. చట్టవిరుద్ధమైన కొన్ని అంశాలు ఉన్నాయి. మీరు నిషేధమైన కంటెంట్‌ను శోధిస్తే జైలుకు కూడా వెళ్లే అవకాశం ఉంది. అందుకే గూగుల్‌లో ఏమైనా సెర్చ్ చేసేప్పుడు కాస్తా ఆలోచించి వెతకండి. పొరపాటున కూడా గూగుల్‌లో సెర్చ్ చేయకూడని.. విషయాలను వెతికితే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఆ కంటెంట్ గురించి తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాంబును ఎలా తయారు చేయాలి..?


బాంబు తయారీ గురించి గూగుల్‌లో సెర్చ్ చేయకూడదు. బాంబు కోసం వెతికితే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. బాంబులు ఎలా తయారు చేయాలో పొరపాటున కూడా వెతకకండి. సైబర్ సెల్ ఈ కార్యకలాపాలపై ఎల్లప్పుడూ ఓ నిఘా ఉంచుతుంది. భద్రతా సంస్థలు మీపై చర్య తీసుకునే అవకాశం ఉంది.  


ప్రైవేట్ ఫోటో అండ్ వీడియో లీక్


గూగుల్‌లో ప్రైవేట్ ఫోటోలు లేదా వీడియోలను లీక్ చేయడం కూడా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల కూడా మీరు జైలుకు వెళ్లే అవకాశం ఉంటుంది. 


గర్భస్రావం ఎలా చేయాలి..?


అబార్షన్‌కు సంబంధించిన శోధించే పద్ధతులు కూడా నేరం కిందకే వస్తాయి. గర్భస్రావం గురించి అస్సలు సెర్చ్ చేయకండి. చట్టం ప్రకారం వైద్యుని సలహా లేకుండా అబార్షన్ చేయరాదు.


చైల్డ్ పోర్న్..


చైల్డ్ పోర్నోగ్రఫీ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. గూగుల్‌లో చైల్డ్ పోర్న్‌ని సెర్చ్ చేయడం.. చూడడం లేదా షేర్ చేయడం చట్ట ప్రకారం నేరం. ఉల్లంఘిస్తే జైలుశిక్ష పడే అవకాశం ఉంది.


సినిమా పైరసీ


ఏదైనా సినిమాను విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ చేయడం చట్ట ప్రకారం నేరం. ఆన్‌లైన్‌లో లీక్ చేసినా.. డౌన్‌లోడ్ చేసినా శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించవచ్చు.


Also Read: Pee Gate in Karnataka: బస్సులో నిద్రిస్తున్న మహిళపై మూత్రం పోసిన యువకుడు   


Also Read: ICICI Bank FD Rates: హెచ్‌డీఎఫ్‌సీ బాటలో ఐసీసీఐ.. ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంపు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి