Honor 200 Pro Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ హానర్ (Honor) తమ కస్టమర్స్‌కి గుడ్‌ న్యూస్‌ తెలిపింది. మార్కెట్‌లోకి రెండు కొత్త మొబైల్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. వీటిని కంపెనీ హానర్ 200, హానర్ 200 ప్రో పేర్లతో లాంచ్‌ చేసింది. ఇవి 16 GB ర్యామ్‌, 1 TB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వచ్చింది. అంతేకాకుండా ఈ మొబైల్‌ ఎంతో శక్తివంతమైన 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో లభిస్తోంది. ఇది అద్భుతమైన డిస్ల్పే సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్‌తో పాటు 66 వాట్ల వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో కంపెనీ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇవే కాకుండా ఈ మొబైల్స్‌లో ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Honor 200 స్మార్ట్‌ఫోన్స్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
ఈ Honor 200 స్మార్ట్‌ఫోన్స్‌లో కంపెనీ ఫుల్ HD+ OLED కర్వ్డ్ డిస్‌ప్లేను అందిస్తోంది. ఇది 2664x1200 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల ఉంటుంది. అంతేకాకుండా ఈ దీని డిస్ల్పే 4000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్ సెటప్‌తో లభిస్తోంది. అలాగే ఇది 16 GB ర్యామ్‌తో 512 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన ప్రాసెసర్‌ వివరాల్లోకి వెళితే, ఇది స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఇది త్రిపుల్‌ కెమెరాతో లభిస్తోంది.


ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ కెమెరా వివరాల్లోకి వెళితే, దీని బ్యాక్‌ సెటప్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌ కెమెరా ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 50-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ టెలిఫోటో కెమెరాతో లభిస్తోంది. అలాగే 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు ఈ కెమెరాలు అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ 5200mAh బ్యాటరీతో లభిస్తోంది. అంతేకాకుండా 100 వాట్ల సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్‌ Android 14 ఆధారంగా MagicOS 8.0పై రన్‌ అవుతుంది. 


హానర్‌ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్‌ చేసింది. అయితే వీటి విక్రయాలు మే 31వ తేది నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ హానర్ 200 మొబైల్‌ ధర వివరాల్లోకి వెళితే, ఇది రూ.30,975 నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండవ మోడల్‌ వివరాల్లోకి వెళితే, ఈ హానర్ 200 ప్రో స్మార్ట్‌ఫోన్‌ రూ. 40 వేల నుంచి మొదలవుతుంది. అయితే కంపెనీ త్వరలోనే భారత మార్కెట్‌లో కూడా లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కంపెనీ ఈ మొబైల్స్‌కి సంబంధించిన అధికారిక ప్రకటను కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


హానర్ 200 ప్రో మొబైల్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
6.78 అంగుళాల ఫుల్ HD+ OLED డిస్‌ప్లే
2700x1224 పిక్సెల్ రిజల్యూషన్‌
120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌
16 GB LPDDR5 ర్యామ్
1 TB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సపోర్ట్‌ 
Adreno 735 GPU
స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్‌
50 మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ OV50H ప్రధాన కెమెరా
12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా
50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా
50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
3D డెప్త్ సెన్సార్ సపోర్ట్‌
ఆండ్రాయిడ్ 14, MagicOS 8.0


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి