HONOR X60i Launch: 12GB Ram, 50MP కెమేరా అద్భుత డిజైన్ తో హానర్ కొత్త ఫోన్ అతి తక్కువ ధరకే
HONOR X60i Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ మరో కొత్త మోడల్ లాంచ్ చేసింది. లేటెస్ట్ ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త మోడల్ ఫోన్లు అందించే హానర్ ఈసారి అద్దిరిపోయే ఫీచర్లు ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
HONOR X60i Launch Updates: ప్రముఖ టెక్ కంపెనీ Honor మరోసారి అద్బుతమైన ఫీచర్లతో సరికొత్త ఫోన్ లాంచ్ చేసింది. చైనాలో Honor X60i పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలో భారతీయ మార్కెట్లో రానుంది. గత ఏడాది లాంచ్ అయిన Honor X50i కు అప్ గ్రేడెడ్ వెర్షన్ ఇది. ఇందులో కొన్ని మోస్ట్ పవర్ ఫుల్ ఫీచర్లు ఉన్నాయి.
Honor X60i అనేది 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 200 నిట్స్ బ్రైట్ నెస్ కలిగి ఉండటంతో రిజల్యూషన్ బాగుంటుంది. సేఫ్టీ విషయానికొస్తే ఇందులో ఇంటిగ్రేటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అమర్చారు. ఇక యాంటీ వాటర్, డస్ట్ రెసిస్టెన్సీ విషయంలో ఐపీ 64 రేటింగ్ ఉంది. హానర్ ఫోన్లు డిజైన్, కెమేరా పరంగా అద్భుతంగా ఉంటాయి. ఈ ఫోన్ క్లౌడ్ బ్లూ, మూన్ షాడో వైట్, కోరల్ పర్పుల్, మ్యాజిక్ నైట్ బ్లాక్ రంగుల్లో లభ్యం కానుంది. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6080 ప్రొసెసర్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఆక్టా కోర్ సీపీయూ ఉంటుంది.
ఈ ఫోన్ కనెక్టివిటీ అయితే వైఫై, బ్లూటూత్ 5.2 సపోర్ట్ చేస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సెక్యూరిటీ కోసం ఉంది. 35 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంది. 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. ర్యామ్ 12 జీబీ కావడంతో ఫోన్ పని తీరు చాలా వేగంగా ఉంటుంది. ఇక కెమేరా అయితే 50 మెగా పిక్సెల్ వైడ్ కెమేరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ లేదా వీడియా కాలింగ్ కోసం 8 మెగా పిక్సెల్ కెమేరా ఉంది.
Honor X60i మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర దాదాపుగా 16 వేలుంది. ఇక మిడ్ రేంజ్ ఫోన్ 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 18,499 రూపాయలుగా ఉంది. ఇందులోనే 12 జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 20,499 రూపాయలుగా ఉంది.
Also read: Weight Loss Drink: బరువు వేగంగా తగ్గాలంటే గ్రీన్ టీ వర్సెస్ గ్రీన్ కాపీ, ఏది మంచిది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook