Google Magic Eraser: మీకు బాగా నచ్చిన ఫోటోలో నచ్చని వస్తువులు ఉన్నాయా..ఇలా డిలీట్ చేయవచ్చు
Google Magic Eraser: ప్రముఖ టెక్ దిగ్గజం యూజర్ల సౌలభ్యం, సౌకర్యం కోసం చాలా రకాల ఫీచర్లు అందిస్తుంటుంది. మీకు తెలియని ఫీచర్లు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకోగలిగితే చాలా ప్రయోజనాలు పొందుతారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Google Magic Eraser: గూగుల్ అందించే వివిధ రకాల ఫీచర్లలో అతి ముఖ్యమైంది గూగుల్ మేజిక్ ఎరేజర్. ఈ ఫీచర్ గురించి పూర్తిగా తెలిస్తే ఇక అద్భుతాలే కన్పిస్తాయి. మీ ఫోటోలు మరింత ఆకర్షణీయంగా మారవచ్చు. మీకు నచ్చిన ఫోటోలు నచ్చినట్టు ఉంచుకోవచ్చు. అసలు ఈ గూగుల్ మేజిక్ ఎరేజర్ ఫీచర్ ఏంటి, ఎలా పనిచేస్తుంది.
సాధారణంగా ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో చాలా ఫోటోలు ఉంటాయి. అందులో కొన్ని ఫోటోలు బాగున్నా సరే..అదే ఫోటోలో నచ్చని వస్తువులో లేదా ఇతర వ్యక్తులో ఉండవచ్చు. లేదా బహిరంగ ప్రదేశాల్లో మంచి ఫోటో తీసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఇతరులెవరైనా ఉండవచ్చు. అవి తొలగించాలంటే ఫోటో షాప్ ద్వారా మాత్రమే సాధ్యమయ్యేది. కానీ గూగుల్ ప్రవేశపెట్టిన గూగుల్ మేజిక్ ఎరేజర్ ద్వారా మీకు నచ్చిన ఫోటోను నచ్చినట్టే భద్రపర్చుకోవచ్చు. అంటే మీకు నచ్చిన ఫోటోలు నచ్చని వస్తువులు లేదా వ్యక్తుల్ని తొలగించవచ్చు. అదే మేజిక్ ఎరేజర్ గొప్పతనం.
గూగుల్ మేజిక్ ఎరేజర్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫోటో ఎడిటింగ్ టూల్. దీని ద్వారా క్యాప్చర్ చేసిన ఫోటోలో అనవసరమైన బ్యాక్‌గ్రౌండ్ డిలీట్ చేయవచ్చు. ముందుగా గూగుల్ ఫోటోస్ యాప్ ఓపెన్ చేయాలి. అందులో మీరు ఎడిట్ చేయాలనుకునే ఫోటోను ఎంచుకోవాలి. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. తరువాత గూగుల్ మేజిక్ ఎరేజ్ టూల్ ఎంపిక చేసుకుని ఫోటో సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు గూగుల్ ఫోటోస్ సూచనలతో తొలగించాల్సినవాటిపై ఎరేజ్ ఆల్ క్లిక్ చేయాలి. అంతే సులభంగా అయిపోతుంది. అవసరం లేనివాటిని ఆటోమేటిక్ లేదా మేన్యువల్ విధానంలో తొలగించవచ్చు. అవసరం లేని వస్తువులు లేదా వ్యక్తుల చుట్టూ సర్కిల్ చేసి ఎరేజ్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు అనుకున్నట్టుగా మార్పులు చేశాక సేవ్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది.
గూగుల్ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో స్కామ్ కాల్స్ సమస్యకు చెక్ పెట్టనుంది. గూగుల్ నానో ఏ1 ఉపయోగించాలి. అవసరం లేని కాల్స్ బ్లాక్ చేయడం లేదా వాటి గురించి అలర్ట్ చేస్తుంది.
Also read: Amazon Sale 2024: అమెజాన్‌లో ఈ 5 ట్యాబ్‌లపై ఏకంగా 74 శాతం డిస్కౌంట్, లిమిటెడ్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook