దేశంలో ఎవరికి ఫోన్ చేసినా +91తో మొదలవుతుంటుంది. ఇన్‌కమింగ్ కాల్ లేదా అవుట్‌గోయింగ్ కాల్ ఏదైనా సరే..+91 తప్పకుండా కన్పిస్తుంది. చాలామంది ఇది గమనించినా దీనివెనుక కారణమేంటనేది తెలియదు. ఆ కారణాలేంటో మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతిదేశానికి ఒక కంట్రీ కోడ్ ఉంటుంది. వేర్వేరు దేశాలకు వేర్వేరు కోడ్స్ ఉంటాయి. అదే విధంగా ఇండియా కంట్రీ కోడ్ +91. అందుకే ఇక్కడి ఫోన్ నెంబర్ల ముందు తప్పనిసరిగా +91 వస్తుంటుంది. అసలు ఈ కంట్రీ కోడ్ ఎలా నిర్ణయిస్తారు. అంటే ఇండియాకు కంట్రీ కోడ్ గా +91 ఎలా నిర్ధారించారనేది తెలుసుకోవాలి. దేని ఆధారంగా ఇది నిర్ణయిస్తారనే వివరాలు ఇవీ..


కంట్రీ కోడ్ ఎలా నిర్ధారిస్తారు


ఇండియాలో +91 కంట్రీకోడ్ గా ఉపయోగిస్తున్నారు. అదే ఇతర దేశాలకు వేర్వేరుగా ఉంటుంది. వాస్తవానికి ఈ కోడ్ ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్‌కు సంబంధించింది. ఇదొక ఏజెన్సీ. దాంతోపాటు యునైటెడ్ నేషన్‌కు చెందిన ఓ విభాగం. ఏ దేశానికి ఏ కోడ్ అనేది ఈ ఏజెన్సీ నిర్ధారిస్తుంది.


ఈ ప్రీ ఫిక్స్ కోడ్‌ను దేశంలో వినియోగించకపోయినా ఏ సమస్యా ఉండదు. కానీ బయటి దేశా‌లకు ఫోన్ చేసేటప్పుడు కోడ్ తప్పకుండా వాడాలి. ఇంటర్నేషనల్ కాలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కోడ్ నిర్ధారించారు.193 దేశాలు ఈ కోడ్‌ను వినియోగిస్తుంటాయి. ప్రతి దేశానికి వేర్వేరుగా కోడ్ ఉంటుంది. ఈ కోడ్ నిర్ధారణ జోన్, జోన్‌కు కేటాయించిన నెంబర్ ఆధారంగా జరుగుతుంది. ఇండియా 9వ జోన్ లో ఉన్నందున ఈ ప్రీఫిక్స్ కోడ్ +91 వినియోగిస్తున్నారు. జోన్‌లో ఇచ్చిన నెంబర్ ఆధారంగా 1 కోడ్ లభిస్తుంది. అంటే ఇండియా కోడ్ +91 అవుతుంది. ఇండియా ఏ జోన్‌లో ఉందో శ్రీ లంక, పాకిస్తాన్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇదే జోన్‌లో ఉన్నాయి.


Also read: Bank Strike: దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె, నిలిచిపోనున్న బ్యాంకింగ్, ఏటీఎం సేవలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook