Infinix GT 20 Pro Price: అదిరిపోయే న్యూస్.. 5000mAh బ్యాటరీతో Infinix GT 20 Pro మొబైల్ వచ్చేసింది!
Infinix GT 20 Pro Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లో Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది C- ఆకారపు RGB-లైట్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Infinix GT 20 Pro Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Infinix గుడ్‌న్యూస్ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. ఇది తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్‌ను కంపెనీ Infinix GT 20 Pro పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఎంతో ప్రత్యేకమైన C- ఆకారపు RGB-లైట్ డిజైన్‌ను కలిగి ఉండబోతోంది. అలాగే ఈ మొబైల్ డైమెన్షన్ 8200 అల్టిమేట్ చిప్ సెటప్‌పై పని చేస్తుంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Infinix GT 20 Pro స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు:
ఈ Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ అనేక కొత్త ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఎంతో ప్రత్యేకమైన 6.78 అంగుళాల AMOLED డిప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ మొబైల్ స్లిమ్ బెజెల్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని కారణంగా ఈ మొబైల్ మరింత స్లిమ్‌గా కనిపిస్తుంది. దీని స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి 94.3 శాతం ఉంటుంది. దీంతో పాటు ఇది డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫుల్ HD+ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సెటప్‌ను కలిగి ఉంటుంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సెటప్ వివరాల్లోకి వెళితే.. ఈ Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇందులోని ప్రధాన కెమెరా 108 మెగాపిక్సెల్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు అదనంగా 2 మెగాపిక్సెల్ సెన్సార్‌తో లభిస్తోంది. అలాగే ఫ్రంట్ సైడ్ వివరాల్లోకి వెళితే, ఇది 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఈ మొబైల్‌ను కంపెనీ రెండు స్టోరేజ్ వేరియంట్‌లో లాంచ్ చేసింది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఈ Infinix GT 20 Pro మొబైల్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ వివిధ రకాల చార్జింగ్ మోడ్‌లతో అందుబాటలోకి తీసుకు వచ్చింది. ఇందలో PD 3.0, హైపర్ ఛార్జ్ మోడ్ వంటి ప్రత్యేకమైన మోడ్‌లు కూడా లభిస్తున్నాయి. ఈ మొబైల్ Android 14 ఆధారిత XOS 14పై నడుస్తుంది. దీంతో పాటు 3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌ను కూడా కంపెనీ అందుబాటులో ఉంచింది. అలాగే ఇందులో సౌండ్ కోసం ప్రత్యేకమైన JBL డ్యూయల్ స్పీకర్స్ కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మొబైల్ రూ. 28,864తో లభిస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి