Infinix Smart 8 Hd Price: ప్రముఖ చైనీస్ కంపెనీ ఇన్ఫినిక్స్ మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ మొబైల్‌ ఫోన్‌ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 హెచ్‌డి(Infinix Smart 8 HD) పేరుతో లాంచ్‌ కాబోతోంది. ఇంతక ముందు విడుదల చేసిన స్మార్ట్‌ ఫోన్స్‌ కంటే ఈ మొబైల్‌ డిజైన్‌ పరంగా చాలా రకాల మార్పులతో రాబోతోంది. ముఖ్యంగా మెరుగైన ఫీచర్లతో, కొత్త రంగల్లో విడుదల కాబోతోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌ విడుదలకు ముందే ఫీచర్స్, స్పెషిఫికేషన్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 హెచ్‌డి(Infinix Smart 8 HD) సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Infinix Smart 8 HD కొత్త ఫీచర్:
> ఈ Infinix Smart 8 HD స్మార్ట్‌ ఫోన్‌ నాచ్ ఫీచర్, సబ్-6కె సెగ్మెంట్‌లో రాబోతోంది. 
> ఈ స్మార్ట్‌ ఫోన్‌ మ్యాజిక్ రింగ్‌లో ఫేస్ అన్‌లాక్, బ్యాక్‌గ్రౌండ్ కాల్ మేనేజ్‌మెంట్, ఛార్జింగ్ యానిమేషన్, ఛార్జ్ కంప్లీషన్ రిమైండర్ వంటి ఫంక్షన్‌లను కలిగి ఉంటుంది.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


Infinix Smart 8 HD లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్‌లు:
ఈ Infinix Smart 8 HD మొబైల్‌ను భారతదేశంలో డిసెంబర్ 8న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌కు అధికారిక విడుదలకు ముందే కొన్ని స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ మ్యాజిక్ రింగ్ ఫీచర్‌తో రూ.6,000లోపే అందుబాటులోకి తీసుకురావడం ఇదే మొదటి సారని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు ఈ స్మార్ట్‌ ఫోన్‌ విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. 


ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 హెచ్‌డి స్మార్ట్ ఫోన్‌ 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 500nits గరిష్ట బ్రైట్‌నెస్‌ రాబోతోంది. కస్టమర్స్‌ను ఆకర్శించేందుకు మెరుగైన బ్యాక్ ప్యానెల్‌తో రాబోతోంది. అంతేకాకుండా Infinix Smart 8 HD సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, UFS 2.2 స్టోరేజ్‌, టైప్-సి ఛార్జింగ్ స్లాట్‌ను కలిగి ఉంటుంది. మొదట కంపెనీ ఈ మొబైల్‌ను క్రిస్టల్ గ్రీన్, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్, గెలాక్సీ వైట్ రంగులలో విడుదల చేయబోతోంది. 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి