COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Infinix Smart 8 HD Price: చైనీస్ టెక్ బ్రాండ్ Infinix 2023 సంవత్సరంలో తమ శక్తివంతమైన మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయబోతోంది. ఈ మొబైల్‌ సాధరణ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో అత్యంత స్టైలిష్‌గా  Infinix Smart 8HD పేరుతో స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ బ్యాక్‌ ప్యానెల్‌ యాపిల్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అలాగే డబుల్ కెమెరా సింగిల్‌ ఫ్లాష్‌లైట్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ Infinix Smart 8HD మొబైల్‌ స్లిమ్‌ డిజైన్‌తో రాబోతోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ Infinix డిసెంబర్‌ 13వ తేదిన లాంచ్‌ చేయబోతున్నట్లు వెల్లడించింది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


Infinix Smart 8HD మొబైల్‌ బ్యాక్ కెమెరా డిజైన్ యాపిల్ ఐఫోన్‌కు ఉండే ట్రిపుల్ కెమెరా సెటప్‌ను పోలి ఉంటుంది. ఈ మొబైల్‌ ఫోన్‌  డైనమిక్ ఐలాండ్ వంటి డైనమిక్ నాచ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. అలాగే అధిక రిఫ్రెష్-రేట్ డిస్‌ప్లేతో పాటు సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఈ డిసెంబర్‌ నెలలో ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్ రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌లలో మొదటిదని ప్రముఖ టిప్‌స్టర్స్‌ తెలుపుతున్నారు. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన అధికారిక సమాచారాన్ని Infinix తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ మొబైల్‌ను కంపెనీ రూ.5,669కే విక్రయించబోతున్నట్లు అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


Infinix Smart 8HD ఫీచర్స్‌:
Infinix Smart 8HD స్మార్ట్ ఫోన్‌ 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ల్పే 500nits పీక్ బ్రైట్‌నెస్ వరకు సపోర్ట్‌ చేస్తుంది. అలాగే ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో పాటు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో రాబోతోంది. దీంతో పాటు ఈ మొబైల్‌ UniSOC T606 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. మొదట ఈ స్మార్ట్‌ఫోన్‌  6GB ర్యామ్‌, 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో లాంచ్‌ కాబోతోంది. దీంతో పాటు మెమరీ కార్డ్‌తో 2TB వరకు స్టోరేజ్‌ ఆప్షన్‌ను పెంచుకునే అవకాశాన్ని కూడా అందిస్తోంది. 


ఈ స్మార్ట్‌ ఫోన్‌ బ్యాక్‌ ఫ్యానెల్‌లో క్వాడ్ LED రింగ్ ఫ్లాష్‌తో కూడిన 13MP డ్యూయల్ AI కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరాను కూడా అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్‌ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా XOS 13 వెర్షన్‌పై పని చేస్తుంది. అంతేకాకుండా శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో పాటు USB టైప్-C ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి