Infinix Note 40: 108MP కెమేరా JBL సౌండ్ సిస్టమ్ దిమ్మతిరిగే ఫీచర్లతో Infinix Note 40
Infinix Note 40: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సత్తా చాటుతున్న ఇన్ఫినిక్స్ నుంచి కళ్లు బైర్లు కమ్మే ఫీచర్లతో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Infinix Note 40 ఫోన్ లాంచ్ ఎప్పుడు, ఫీచర్లు ఎలా ఉంటాయనే వివరాల్ని కంపెనీ వెల్లడించింది. ఆ వివరాలు మీ కోసం.
Infinix Note 40: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ కంపెనీ ఫోన్లలో ఇన్పినిక్స్ ఒకటి. ఆకర్షణీయమైన ఫీచర్లు, అందుబాటు ధరతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇండియాలో సైతం ఇన్ఫినిక్స్ ఫోన్ ప్రేమికులు పెరుగుతున్నారు. ఇప్పుడు త్వరలో ఇన్ఫినిక్స్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ కానుంది.
ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త ఫోన్ లాంచ్ కానుంది. Infinix Note 40 ఫీచర్లు చూస్తే పిచ్చెక్కాల్సిందే. అత్యంత శక్తివంతమైన, అద్భుతమైన స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్ అందరికీ షాక్ ఇవ్వనుంది. ఈ ఫోన్ 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 93.8 స్క్రీన్ టు బాడీ రేషియోతో ఉంటుంది. ఈ ఫోన్ 33 వాట్స్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40 ఐపీ 53 రేటింగ్ కలిగిన డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్‌తో ఉండటం విశేషం. దాంతో మ్యూజిక్ అద్భుతంగా ఎంజాయ్ చేయవచ్చు. 360 డిగ్రీలు సౌండ్ బూస్ట్ ఉంటుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7020 చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది.
ఈ ఫోన్ 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇందులో ట్రిపుల్ కెమేరా సిస్టమ్ ఉంటుంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, డ్యూయల్ 2 మెగాపిక్సెల్ సెన్సార్ కెమేరా ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40 అబ్సిడియన్ బ్లాక్, టైటాన్ గోల్డ్ రంగుల్లో విడుదల కానుంది. ఇండియాలో ఈ ఫోన్ జూన్ 21న లాంచ్ కానుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 40 ఇటీవల ఫిలిప్పీన్స్ దేశంలో 20 వేలకు లాంచ్ అయింది. ఇండియా దాదాపుగా ఇదే ధర లేదా 22 వేల వరకూ ఉండవచ్చని అంచనా ఉంది.
Also read: OnePlus Nord CE 4 Lite: 50MP కెమేరా 8GB Ramతో వన్‌ప్లస్ కొత్త ఫోన్ లాంచ్ తేదీ, ధర వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook