Infinix Zero 40: ప్రముఖ చైనా టెక్ కంపెనీ ఇన్ఫినిక్స్ నుంచి కొత్త మోడల్ లాంచ్ అయింది. ఆగస్టు 29వ తేదీన ప్రపంచ మార్కెట్‌లో లాంచ్ అయిన ఈ మోడల్ ఇప్పుడు భారతీయ మార్కెట్‌లో రానుంది. కళ్లు చెదిరే ఫీచర్లతో సెప్టెంబర్ 18న భారతీయ మార్కెట్‌లో అడుగెట్టనుంది. ఈ ఫోన్ ప్రత్యేకతలు, ఫీచర్లు ఎలా ఉంటాయో ఓసారి చెక్ చేద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Infinix Zero 40 5G స్మార్ట్‌ఫోన్ ఇది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమిడి ఉంటుంది. ఈ ఫీచర్ వాల్ పేపర్లను అద్భుతంగా తయారు చేస్తుంది. ఫోటో ఎడిటింగ్ ఏఐ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. అంటే ఏఐ ఎరేజర్ ఫీచర్ ఈ ఫోన్‌లో ప్రత్యేకత. దీంతోపాటు ఏఐ కట్ అవుట్ స్టిక్కర్ ఫీచర్ ఉంటుంది. ఈ ఫోన్ 6.78 ఇంచెస్ 3డి కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఐ కేర్ మోడ్ సర్టిఫికేషన్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రోసెసర్ ఉంటుంది. 


ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. అన్నింటికీ మించి కెమేరా అద్భుతమైన రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇందులో ప్రైమరీ మెయిన్ కెమేరా ఏకంగా 108 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది కాకుండా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంటాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 


Also read: Boats Removal: భారీ క్రేన్లతో బోట్ల తొలగింపు విఫలం, రేపట్నించి ప్లాన్ బి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.