Infinix Zero Ultra Price: ప్రముఖ ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ఫారం ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి ఆఫర్స్ ముగిసిన తర్వాత కూడా కొన్ని వస్తువులపై ప్రత్యేక డీల్స్ ప్రారంభమయ్యాయి. కొన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలకు చెందిన మొబైల్స్ ఈ డీల్స్‌లో భాగంగా అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. శక్తివంతమైన కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం గా భావించవచ్చు. ఇటీవలే ఇన్ఫినిక్స్ విడుదల చేసిన 200MP కెమెరా కలిగిన Zero Ultra స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 10,000లోపే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న ఆఫర్స్ ఏంటో, ఎలా కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకు లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఫ్లిప్‌కార్ట్‌లోని ఈ అద్భుతమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపు లభిస్తోంది అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ మొబైల్‌ని కొనుగోలు చేసే క్రమంలో ఎక్స్చేంజ్ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే అతి చౌకగా లభిస్తుంది.


Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  


Infinix Zero Ultra పై బంపర్ డిస్కౌంట్‌:
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్‌తో లభిస్తోంది.  ఈ Infinix Zero Ultra  అసలు MRP రూ. 49,999గా కాగా ఫ్లిప్కార్ట్ అందిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా 40% తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ మీకు కేవలం రూ.29,999కే పొందవచ్చు. మీరు ఈ స్మార్ట్ ఫోన్ను మరింత తగ్గింపుతో పొందడానికి మీరు వినియోగిస్తున్న క్రెడిట్ కార్డుతో బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ ను EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి నో కాస్ట్ EMI కూడా లభిస్తోంది. 


ఎక్స్చేంజ్ ఆఫర్:
ఈ Infinix Zero Ultra స్మార్ట్‌ఫోన్‌ ను కొనుగోలు చేసే వారికి ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. మీరు వినియోగిస్తున్న మంచి కండిషన్ కలిగిన పాత మొబైల్‌ను ఎక్స్చేంజ్ చేసి కొనుగోలు చేస్తే దాదాపు గరిష్టంగా రూ.21,400 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ పాత స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పై ఆధారపడి ఉంటుంది. ఇక అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ. 8,599 మాత్రమే ఈ మొబైల్ ను కొనుగోలు చేయవచ్చు.


ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా స్పెసిఫికేషన్‌లు:
6.8-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్‌
180W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
200MP OIS కెమెరా లెన్స్
MediaTek డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌
2MP డెప్త్ సెన్సార్ కెమెరా
13MP అల్ట్రావైడ్ కెమెరా
32MP ఫ్రంట్ కెమెరా
4500mAh బ్యాటరీ
180W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌


Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook