iPhone 13 Price: హోలీ 2023 బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా తగ్గిన ఐఫోన్ 13 ధర! ఆఫర్ మూడు రోజులే
Purchage Apple iPhone 13 Just Rs 47626 in Cashify. హోలీ 2023 సేల్ సందర్భంగా క్యాషిఫైలో మార్ఛి 3 నుంచి 6 వరకు ఆఫర్స్ ఉన్నాయి. క్యాషిఫైలో ఐఫోన్ 13 ధర రూ. 47,626గా అవుతుంది.
Buy Apple iPhone 13 Only Rs 47626 in Cashify: మరో వారం రోజుల్లో (2023 మార్చి 8) హోలీ 2023 పండగ రానుంది. ఈ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బచత్ ధమాల్' సేల్ ప్రకటించింది. ఈ ఆఫర్ మార్ఛి 3 నుంచి 5 వరకు ఉంటుంది. ఈ సేల్‌లో 1000కి పైగా కంపెనీలకు చెందిన లక్షల ప్రొడక్ట్‌లపై 80 శాతం డిస్కౌంట్ ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ ప్రత్యేక సేల్‌లో మొబైల్స్, ల్యాప్ ట్యాప్స్, ట్యాబ్లెట్స్, దుస్తులు, టీవీలు, వాషింగ్ మెషీన్స్, ఏసీ లాంటి వాటిపై ఆకట్టుకునే స్థాయిలో ఆఫర్లు ఉన్నాయి. అలానే క్యాషిఫై (Cashify)లో కూడా అద్భుత ఆఫర్లు ఉన్నాయి.
హోలీ 2023 సేల్ సందర్భంగా క్యాషిఫైలో (Holi 2023 Cashify iPhone Offers) మార్ఛి 3 నుంచి 6 వరకు ఆఫర్స్ ఉన్నాయి. ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుని, బడ్జెట్ తక్కువగా ఉంటే.. ఇదే మంచి అవకాశం. ఐఫోన్ 13 (iPhone 13)ని క్యాషిఫైలో (iPhone 13 Price Cashify) అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. క్యాషిఫైలో ఐఫోన్ 13పై 25 శాతం తగ్గింపు ఉంది. ఈ ఫోన్ క్యాషిఫైలో రూ. 49,099కి అందుబాటులో ఉంది. యూపీఐ చెల్లింపు చేయడం ద్వారా 3 వేల రూపాయల తగ్గింపు పొందవచ్చు. అంటే ఐఫోన్ 13 ధర రూ. 47,626గా అవుతుంది.
క్యాషిఫై (Cashify) యొక్క హోలీ 2023 సేల్‌లో పాత స్మార్ట్‌ఫోన్‌ల మార్పిడిపై (ఎక్స్‌ఛేంజ్) అదనపు తగ్గింపులు మరియు ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు ఉన్నాయి. కస్టమర్ తన పునరుద్ధరించిన ఫోన్‌పై 6 నెలల వారంటీ మరియు 7 రోజుల రీప్లేస్‌మెంట్ వారంటీని కూడా పొందుతాడు. ఈ సేల్ సమయంలో అనేక ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు భారీ తగ్గింపులను కలిగి ఉన్నాయి. మీరు కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే.. క్యాషిఫైలో చాలా ఖరీదైన ఫోన్లు కూడా చాలా చౌకగా లభిస్తాయి.
ఐఫోన్ 13 స్పెసిఫికేషన్లు:
కెమెరాా: 12 MP + 12 MP
డిస్ ప్లే: 6.1 Inches (15.49 Cm)
పెర్ఫార్మెన్స్: Apple A15 Bionic
ఆపరేటింగ్ సిస్టమ్: IOS V15
ర్యామ్: 4 GB
స్టోరేజ్: 128 GB
Also Read: Hyundai Micro SUV: హ్యుందాయ్ నుంచి చౌకైన ఎస్‌యూవీ.. ఇక టాటా పంచ్ కౌంట్ డౌన్ ప్రారంభం!
Also Read: Cheapest Electric Cars 2023: చీపెస్ట్ 3 ఎలక్ట్రిక్ కార్స్ ఇవే.. పూర్తి ఛార్జీతో 320 కిమీ ప్రయాణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.