iPhone 13 Price Drop: ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. రూ.25 వేల తగ్గింపు కొద్దిరోజులు మాత్రమే!
యాపిల్ 15 సీరీస్ ఈ మధ్యే భారత్ లో లాంచ్ అయింది. దీని ఫలితంగా ఐఫోన్ 13, ఐఫోన్ 14 ధరలు చాలా వరకు తగ్గాయి. ఐఫోన్ 13 మార్కెట్ ధర రూ. 69,900 ఉండగా.. ఇది ఫ్లిప్‌కార్టులో అన్ని ఆఫర్లు పోనూ.. రూ. 25వేల లోపే లభిస్తోంది.
iPhone 13 Price Drop: మొబైల్ తయారీలో ప్రముఖ దిగ్గజ సంస్థ యాపిల్ ఇటీవలే తమ కొత్త మోడల్ అయిన ఐఫోన్ 15 గురించి ప్రకటన చేసింది. కొత్త మోడల్ మార్కెట్లోకి రావడానికి కొద్ది రోజుల సమయం పడుతుంది. ఈ క్రమంలో యాపిల్ పాత మోడల్స్ అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 13లపై భారీ తగ్గింపు అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ లో ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపు సేల్ వచ్చేసింది. ఐఫోన్ 13 మార్కెట్ ధర రూ. 69,900 ఉండగా.. ఇది ఫ్లిప్‌కార్టులో రూ. 55,999 ధరకే లభిస్తోంది. దీంతో పాటు ఈ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంకుల డిస్కౌంట్స్ కలుపుకొని ఈ మొబైల్ పై మరింత డిస్కౌంట్ లభించనుంది. దాదాపుగా రూ. 25 వేల వరకు తగ్గేందుకు అవకాశం ఉంది.
తక్కువ ధరలో అధిక నాణ్యత కలిగిన స్మార్ట్ ఫోన్ కావాలంటే ఐఫోన్ గొప్ప ఎంపిక అని చెప్పుకోవచ్చు. కానీ, తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 15లో చెప్పుకోదగ్గ ఫీచర్ ఏదీ లేని కారణంగా అవే ఫీచర్స్ తో దాని తర్వాతి మోడల్స్ తక్కువ ధరకి సొంతం చేసుకోవచ్చు. కొత్త మోడల్ తో పోల్చుకుంటే ఐఫోన్ 13లో సరిపోయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. కెమెరా క్వాలిటీ, సాఫ్ట్ వేర్ వంటివి ఐఫోన్ 13లో మంచి పనితీరును కనబరుస్తున్నాయి.
2021 సంవత్సరంలో యాపిల్ విడుదల చేసిన iPhone 13 ఆ ఏడాది సెప్టెంబర్ లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అంతకు ముందు ఐఫోన్ 12 అప్డేట్ వర్షెన్ గా మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ A15 బయోనిక్ చిప్, రెటినా AMOLED డిస్ ప్లే కలిగి ఉంది. కెమెరా క్వాలిటీ కూడా పాత మోడల్స్ కంటే ఎంతో మెరుగ్గా ఉండడం సహా ఈ హ్యాండ్ సెట్ 5G కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుంది.
Also Read: CM KCR at Palamuru project: నార్లాపూర్ పంప్ హౌజ్ వద్ద మహా బాహుబలి మోటార్స్ ఆన్ చేసిన సీఎం కేసీఆర్
iPhone 13 పనితీరు, సాఫ్ట్‌వేర్ వివరాలు
ఐఫోన్ 13లో A15 బయోనిక్ చిప్ ఉంది. ఐఫోన్ 15లో A16 బయోనిక్ చిప్ ఉంది. ఇప్పటికీ, A15 బయోనిక్ చిప్ కాలం చెల్లిందని చెప్పలేము. ఇది ఇప్పటికీ వినియోగదారులకు మంచి పెర్ఫార్మెన్స్ ను ఇస్తోంది. ఈ చిప్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ కు చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది ఫ్రెష్ సాఫ్ట్ వేర్ కాకపోయినా.. అన్ని రకాల అప్లికేషన్స్ సజావుగా నిర్వహిస్తుంది.
అయితే ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్ కొన్నేళ్ల పాటు అప్డేట్స్ ను తీసుకుంటూనే ఉంటుంది. యాపిల్ సంస్థ తమ హ్యాండ్ సెట్స్ ను ప్రతి 5 లేదా 6 ఏళ్లకు కొత్త అప్డేట్స్ ను ఇస్తుంటుంది. దీన్ని బట్టి iPhone 13 రాబోయే కొన్ని సంవత్సరాల పాటు తాజా iOS అప్‌డేట్‌లు, సెక్యూరిటీ ప్యాచ్‌లను పొందడం కొనసాగిస్తుంది. iOS 20కి అప్‌డేట్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
Also Read: Reasons Behind IND VS BAN Match Defeat: బంగ్లాదేశ్ చేతిలో ఓటమికి వీళ్లే కారణమా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook