iPhone 14 Sales: ఐఫోన్ 14 కోసం ఎదురుచూస్తున్న యాపిల్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఐఫోన్ 14  విక్రయాలు ఇవాళ్టి నుంచి ఇండియాలో ప్రారంభమైపోయాయి. ఇవాళే మీ ఐఫోన్ 14 సొంతం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా యాపిల్ ఇండియా స్టోర్స్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, క్రోమా, యూనికార్న్‌లలో ఐఫోన్ 14 అందుబాటులో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు ఎదురుచూస్తున్న ఐఫోన్ 14 మీకు ఇష్టమైన ఐదు రంగులు మిడ్‌నైట్, బ్లూ, స్టార్‌లైట్, పర్పుల్, రెడ్‌లో అందుబాటులో ఉంది. 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్స్‌లో లభ్యం కానున్న ఐఫోన్ 14 ధర 89,900 రూపాయలతో ప్రారంభం కానుంది. 


ఐఫోన్ 14.. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 89,900 కాగా, 256 జీబీ ధర 99,900గా ఉంది. ఇక 512 జీబీ వేరియంట్ ధర 1,09,900 రూపాయలుంది. 


ఐఫోన్ 14 ప్లస్‌ను యాపిల్ స్టోర్ నుంచి కొనుగోలు చేస్తుంటే కంపెనీ 7వేల రూపాయలు తక్షణ డిస్కౌంట్‌‌ను లాంచ్ ఆఫర్‌గా అందిస్తోంది. అంటే ఈ ఫోన్ మీకు 82,900 రూపాయలకు లభించనుంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో మరింతగా తగ్గుతుంది. 


ఇక ఐఫోన్ 14 ప్లస్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా హెచ్‌డిఎఫ్‌సి కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5000 రూపాయలు క్యాష్‌బ్యాక్‌తో పాటు 6 నెలలు నో కాస్ట్ ఈఎంఐ వర్తిస్తుంది. మరో 3 వేల రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్ ఉంటుంది. ఇప్పటికే ప్రీ బుకింగ్ చేసుకున్నవారికి ఇవాళ్టి నుంచి డెలివరీ అందుతుంది. 


ఐఫోన్ 14 ప్లస్ ఫీచర్లు


ఐఫోన్ 14 ప్లస్ 6.7 ఇంచెస్ డిస్‌ప్లే, అద్భుతమైన బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంది. ఐఫోన్ 14 ప్లస్‌లో డ్యూరబుల్, సోఫిస్టికేటెడ్ ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియంతో నిర్మితమైంది. ఏ15 బయోనిక్ చిప్, 5 కోర్ జీపీయూ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఇందులో ఫోటోనిక్ ఇంజన్‌తో కూడిన అత్యాధునిక కెమేరా ఉంది. డాల్బీ విజన్ హెచ్‌డీఆర్, సినీమేటిక్ మోడ్ 4కే ఇతర ప్రత్యేకతలు. 


Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్, మళ్లీ పెరగనున్న డీఏ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook