Apple iPhone 15 Free: జస్ట్ షేర్ చేస్తే iPhone 15.. దిమ్మతిరిగే ఆఫర్.. దెబ్బ అదుర్స్ కదూ

iPhone 15 Scam Alert: ఆన్‌లైన్ కేటుగాళ్లు కొత్త కొత్త ప్లాన్లతో ప్రజలను ముంచేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో iPhone 15కు భారీ క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ను సొంతం చేసుకునేందుకు జస్ట్ షేర్ చేస్తే iPhone 15 మీ సొంతం ఇండియా పోస్ట్ పేరుతో ఫేక్ మెసేజ్‌ను సృష్టించారు. ప్రస్తుతం ఈ మెసేజ్ తెగ వైరల్ అవుతోంది.
iPhone 15 Scam Alert: యాపిల్ ఫోన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న iPhone 15 సిరీస్ మన దేశంలో ఈ నెల 22న లాంచ్ అయిన విషయం తెలిసిందే. అయితే iPhone 15 పై ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకుని.. ఐఫోన్ ప్రేమికులను ముంచేందుకు స్కామర్లు రెడీ అయ్యారు. ఇండియా పోస్ట్ వారి పేరుతో మోసానికి తెరలేపారు. ఇండియా పోస్ట్ పేరుతో నడుస్తున్న ఈ స్కామ్ మెసేజ్‌లో లక్కీ విన్నర్స్ ఆ పోస్ట్‌ను 5 గ్రూప్‌లు, 20 మంది ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటే.. సరికొత్త ఐఫోన్ 15 ను గెలుచుకోవచ్చని కేటుగాళ్లు గాలం వేస్తున్నారు. వినియోగదారులు తమ గిఫ్ట్‌ను ఎక్కడ క్లెయిమ్ చేయవచ్చో అందులో లింక్‌ను ప్రొవైడ్ చేశారు.
ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా.. వల వేసి మోసం చేసేందుకు ఆన్‌లైన్ నకిలీ రాయుళ్లు రెడీగా ఉన్నారు. ట్రెండ్‌కు అనుగుణంగా ఫేక్ ఆఫర్లు సృష్టించి.. వారి వలలో పడినవారిని నిండా ముంచేస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో iPhone 15 సిరీస్ ఫీవర్ నడుస్తుండడంతో అమాయకులను బుట్టలో వేసుకునేందుకు ప్లాన్ వేశారు. మాములుగా చెబితే ప్రజలు నమ్మరని.. ఇండియా పోస్ట్‌ను ఎంచుకున్నారు. అచ్చం ఇండియా పోస్ట్ మాదిరే నకిలీ వెబ్‌సైట్ క్రియేట్ చేశారు.
"అభినందనలు.. మీరు ఐఫోన్ 15 గెలుచుకున్నారు. మీకు ఈ ఫోన్ కావాలంటే కింద ఇచ్చిన సూచనలు ఫాలో అవ్వండి. కింద వాట్సాప్ లింక్‌పై క్లిక్ చేసి ఐదు గ్రూపులు లేదా 20 మంది ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. తరువాత కంటిన్యూ బటన్ ప్రెస్ చేసి.. మీ ప్రైజ్‌ను తీసుకోండి.." అని అందులో ఉంది. ఇది ఫేక్ మెసేజ్ అని తెలియని చాలా మంది జస్ట్ షేర్ చేస్తే.. iPhone 15 వస్తుందనే ఆశతో వాట్సాప్‌లో అందరికి పంపిస్తున్నారు.
ఈ వైరల్ మెసేజ్‌పై ఇండియా పోస్ట్ ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చింది. "దయచేసి జాగ్రత్తగా ఉండండి..! ఇండియా పోస్ట్ ఏ అనధికారిక పోర్టల్ లేదా లింక్ ద్వారా ఎలాంటి బహుమతిని ఇవ్వడం లేదు. ఇండియా పోస్ట్‌కు సంబంధించిన ఏదైనా సమాచారం కోసం దయచేసి అధికారిక వెబ్‌సైట్‌ను అనుసరించండి" అని ఇండియా పోస్ట్ ట్వీట్‌లో పేర్కొంది. వైరల్ అవుతున్న మెసేజ్ ఫేక్ అని కొట్టిపారేసింది.
ఇలాంటి మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యాశకు పోయి.. గుర్తు తెలియని లింక్స్‌పై క్లిక్ చేసి మీ అకౌంట్‌లలో డబ్బులు పొగొట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి లింక్స్ షేర్ చేస్తూ.. మీరు మోసపోవడంతోపాటు.. మీకు తెలిసిన వాళ్లను కూడా మోసానికి గురయ్యేలా చేస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి