iPhone 14 Price Drop: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజ సంస్థ యాపిల్.. తాజాగా తమ కొత్త మోడల్ ఐఫోన్ 15 గురించి ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో యాపిల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మోడల్ (ఐఫోన్ 15) రాబోతున్న తరుణంలో పాత మోడల్స్ ను భారీ తగ్గింపు ధరతో విక్రయిస్తుంది. ఐఫోన్ 14 (iPhone 14), ఐఫోన్‌ 14 ప్లస్‌ (iPhone 14 Plus), ఐఫోన్ 13 (iPhone 13) వంటి వాటి ధరను తగ్గించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి ఏడాది కొత్త మోడల్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చే యాపిల్.. ఈసారి ఐఫోన్ 15ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ పాత మోడళ్ల ధరలను తగ్గించడం ఆనవాయితీగా వస్తుంది. 


ఎంత తగ్గింపు..?
తాజాగా ఐఫోన్ 14 +, ఐఫోన్ 14, ఐఫోన్ 13 మోడల్స్ ధరలను తగ్గించింది. ఈ క్రమంలో ఐఫోన్ 14 (129 జీబీ) బేస్ మోడల్ ధర రూ. 69,900గా విక్రయానికి ఉంచింది. అయితే ఇదే స్మార్ట్ ఫోన్ ను గతేడాది రూ. 79,900 ధరకు అమ్మకానికి ఉంచగా.. ఇప్పుడు దానిపై రూ. 10 వేల రూపాయలను తగ్గింపునిచ్చింది. 


అదే మోడల్ లోని 256 జీబీ వేరియంట్ ను రూ. 79,900లకు తగ్గించింది. గతంలో ఇది రూ. 89,000గా ఉంది. ఐఫోన్ 14 మోడల్ లోని 512 జీబీ వేరియంట్ ధరను గతంలో రూ. 1,09,900 గా నిర్ణయించగా.. ఇప్పుడు రూ. 99,900 వరకు కుదించింది. 


Also Read: Red Wine Flowing In Streets: కంపెనీలో స్టోరేజ్ ట్యాంకులు పగిలి రోడ్లపై పొంగిపొర్లిన రెడ్ వైన్.. వీడియో వైరల్


మరోవైపు యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ పై కూడా భారీ తగ్గింపును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13 మోడల్స్ పై కూడా రూ. 10 వేల వరకు తగ్గింపుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 14 ప్లస్ ను ఇప్పుడు రూ. 79,900 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 13 మోడల్ బేస్ వేరియంట్ ను రూ. 59,900 వేలకే కొనుగోలు చేయోచ్చు. 


అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ ను విక్రయిస్తున్న యాపిల్ అధికారిక వెబ్ సైట్‌లో మాత్రం కొత్త ధరలు అప్డేట్ అయ్యాయి. కానీ, ఈ - కామర్స్ ప్లాట్ ఫామ్స్ అయిన అమెజాన్, ఫ్లిప్ కార్టుల ధరలో స్వల్ప వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉంది.


Also Read: RBI New Guidelines: లోన్లు తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. బ్యాంకులు ఆ తప్పు చేస్తే రోజుకు మీకు రూ.5 వేలు..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook