iPhone Price Drop: కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 15 మొబైల్ కోసం డిసెంబరు నెల వరకు వేచిచూడక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. కొత్త మోడల్ ఐఫోన్ 15కు మరింత డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వాటిని పొందడం కష్టమని తెలుస్తోంది. ఐఫోన్ కొత్త ట్రెండ్ ఉంటుందనే తెలిసిన క్రమంలో ఇది మరో రెండు నెలలు తప్పదని మార్కెట్ పండితులు అంటున్నారు. అలా చాలా కాలం వేచి చూసే బదులు యాపిల్ ఐఫోన్ గత మోడల్స్ ను కొనుగోలు చేయడం ఉత్తమం. ఐఫోన్ 15 ప్రారంభించిన తర్వాత మిగిలిన పాత మోడల్స్ ధరలు క్రమంగా తగ్గిపోయాయి. అయితే ఆ పాత మోడల్స్ ధరలు ఇప్పుడు ఇలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాపిల్ iPhone 14 (128 GB): రూ. 69,900
ఐఫోన్ 14 మోడల్‌ను మొదట రూ. 79,900 వద్ద మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఆ తర్వాత దాని ధరలో రూ. 10 వేలను తగ్గించి అమ్మకానికి ఉంచారు. 


యాపిల్ iPhone 14 (256 GB): రూ. 79,900
యాపిల్ ఐఫోన్ 14 మోడల్ 256 GB స్టోరేజ్‌తో మొదట రూ. 79,900తో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దీనిపై దాదాపుగా రూ. 10 వేల వరకు తగ్గింపు లభించడం వల్ల ఈ వేరియంట్ ఇప్పుడు రూ. 69,900 వద్ద విక్రయానికి ఉంది.


యాపిల్ iPhone 14 (512 GB): రూ. 99,900
ఐఫోన్ 14 సిరీస్ లోని 512 GB స్టోరేజ్ కలిగి ఉన్న iPhone 14 ను తొలుత రూ. 1,09,900 విక్రయించారు. ఇప్పుడు రూ. 10 వేల తగ్గింపుతో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. మొత్తంగా రూ. 99,900 ధరకే దీన్ని కొనవచ్చు. 


యాపిల్ iPhone 14 Plus (128 GB): రూ. 79,900
ఐఫోన్ 14 ప్లస్ వేరియంట్ మార్కెట్లోకి రూ. 89,900 ప్రారంభ ధరతో వచ్చింది. ఇప్పుడు రూ. 10 వేలు డిస్కౌంట్ తో రూ. 79,900 కే లభిస్తోంది.


యాపిల్ iPhone 14 Plus (256 GB): రూ. 89,900
ఈ స్మార్ట్ ఫోన్ పై కూడా రూ. 10 వేల తగ్గింపు అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ 14 ప్లస్ 256 GB వేరియంట్‌లో ఇప్పుడు రూ. 89,900కి అందుబాటులో ఉంది. దాని మునుపటి ధర రూ. 99,900 గా ఉంది.


Also Read: Flipkart Big Billion Days Sale 2023: మోటోరోలా స్మార్ట్‌ఫోన్లపై ఊహించని ఆఫర్లు


యాపిల్ iPhone 14 Plus (512 GB): రూ. 1,09,900
ఐఫోన్ 14 ప్లస్ మోడల్ ధరలో రూ.10,000 తగ్గింపుతో అందుబాటులోకి వచ్చేసింది. దీని అసలు ధర రూ. 1,19,900. కానీ ఇప్పుడు దీనిని రూ. 1,09,900కి కొనుగోలు చేయవచ్చు.


యాపిల్ iPhone 13 (128 GB): రూ. 59,900
128GB వేరియంట్‌లోని iPhone 13 ధర రూ. 20,000 తగ్గింపుకు అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం రూ. 59,990కి కొనుగోలు చేయడానికి ఉంది.


యాపిల్ iPhone 13 (256 GB): రూ. 69,900
రూ. 89,900 ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 13 256 GB వేరియంట్ ఇప్పుడు రూ. 20,000 తగ్గింపును పొందింది. దీని ప్రస్తుత ధర రూ. 69,900కి తగ్గింది.


యాపిల్ iPhone 13 (512 GB): రూ. 89,900
యాపిల్ iPhone 13 లోని 512 GB వేరియంట్‌లో ప్రారంభ ధర రూ. 1,09,900. అయితే దీనిపై ప్రస్తుతం రూ. 20,000 తగ్గింపు అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ 13 512 వేరియంట్ ను ఇప్పుడు రూ. 89,900కి పొందవచ్చు.


యాపిల్ iPhone 12 (64 GB): రూ. 48,990
మార్కెట్లోకి రూ. 65,900 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఐఫోన్ 12 ఇప్పుడు రూ. 48,900 ధరకు విక్రయిస్తున్నారు. దీనిపై ప్రస్తుతం రూ. 16,910 తగ్గింపు వర్తిస్తుంది.


యాపిల్ iPhone 12 (256 GB): రూ. 64,990
ఐఫోన్ 12 పై దాదాపుగా రూ. 15,910 తగ్గింపుతో 256 GB వేరియంట్ అందుబాటులోకి వచ్చింది. అయితే దీని అసలు ధర రూ. 80,900 కాగా.. ఇప్పుడు దీన్ని రూ. 64,990 కి అమ్మకానికి ఉంచారు.


Also Read: Infinix Note 30 5G మొబైల్‌ను రూ. 1,190కే పొందండి..ఫీచర్లు, డిస్కౌంట్ ఆఫర్ వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook