Iqoo 12 Price: ప్రముఖ చైనీస్‌ టెక్‌ కంపెనీ ఐక్యూ త్వరలోనే మరో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ మొబైల్‌ iQOO 12 సిరీస్‌తో మార్కెట్‌లోకి లాంచ్‌ అవ్వబోతోంది. ఈ iQOO 12 సిరీస్ నవంబర్ 7న చైనాలో విడుదల కాగా..డిసెంబర్ 12న భారతదేశంలో లాంచ్‌ కాబోతున్నట్లు కంపెనీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌  అత్యంత శక్తివంతమైన చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3పై రన్‌ కాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐక్యూ కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌ను మొత్తం రెండు వేరియంట్స్‌లో విడుదల చేయబోతోంది. iQOO 12, iQOO 12 ప్రోలను లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే ఈ రెండు మొబైల్స్‌కి సంబంధించి టీజర్స్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. ఈ టీజర్‌లతో iQOO 12 స్మార్ట్‌ ఫోన్‌లోని RAM, స్టోరేజ్, IP రేటింగ్ సంబంధించిన సమాచారాన్ని అందించింది. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


iQOO 12 సిరీస్‌ ఫీచర్స్‌:
ఈ స్మార్ట్ ఫోన్‌ గేమింగ్ కోసం డిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ iQOO 12 సిరీస్‌ మొబైల్స్‌ Q1 ఇ-స్పోర్ట్స్ చిప్‌పై పని చేయనున్నాయి. అయితే ఈ రెండు సిరీస్స్‌లకు సంబంధించిన ధరలు మాత్రం కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. వీటి ధరలు, ఇతర వివరాలు అతి త్వరలోనే అధికారికంగా అందించే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ టిప్‌ స్టార్‌ తెలిపారు.


iQOO 12 సిరీస్‌ మెరుగైన సౌండ్ అనుభూతిని అందిచేందుకు త్రీ-డైమెన్షనల్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌ను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్ హై-రెస్ ఆడియోతో పాటు హై-రెస్ ఆడియో వైర్‌లెస్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటాయని సమాచారం. iQOO 12 మొబైల్‌ IP68 రేటింగ్‌, iQOO 12 Proని IP68తో మార్కెట్‌లోకి విడుదల కాబోతున్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ OS 4తో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook