Iqoo 12 Pro Price In India: ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు విడుదలవుతున్నాయి. వినియోగదారులు కూడా ఎక్కువ ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్స్ ను కొనుగోలు చేసేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని కొన్ని టెక్ కంపెనీలు అతి తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే త్వరలో iQOO బ్రాండ్ కూడా అతి తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లు కలిగిన మొబైల్ ను విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కంపెనీ iQOO 12 సిరీస్ తో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయబోతోంది. ఈ మొబైల్ నవంబర్ 7న లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే విడుదలకు ముందే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్లు Weiboలో లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం డిజైన్ ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా మరెన్నో రకాల కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల కాబోతోంది.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  


iQOO 12 పూర్తి సమాచారం:
iQOO 12 స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న ఫోటోల వివరాల్లోకి వెళితే.. ఈ స్మార్ట్ ఫోన్ తెలుపు రంగును కూడి ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘచతురస్రాకారంతో వెనక కెమెరా డ్యూయల్ నితో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వెనుక కెమెరా మాడ్యూల్‌ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ను కలిగి ఉంటుంది.


ఈ iQOO విడుదల చేయబోయే మోడల్ Oppo Reno 10 Pro+ స్మార్ట్ ఫోన్ ను పోలి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్100x డిజిటల్ జూమ్ సపోర్ట్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుందని సమాచారం. స్మార్ట్ ఫోన్ వెనుక వైపు iQOO లోగోతో పాటు "Fascination meets innovation" అనే ట్యాగ్‌లైన్‌ కూడా ఉంటుంది. మొత్తంమీద ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం డిజైన్ లో కనిపిస్తుంది.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.