Iqoo 12 Price: మొట్టమొదటిసారిగా కొత్త చిప్‌సెట్‌తో మార్కెట్లోకి iQOO 12 మొబైల్..ధర, ఫీచర్ల పూర్తి వివరాలు ఇవే..
Iqoo 12 Price: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న iQOO 12 స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. ఈ మొబైల్ అత్యంత శక్తివంతమైన ఫీచర్స్‌తో లభిస్తోంది. అయితే రేపటి నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్ లో ఉన్న ఫీచర్స్ ఏంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Iqoo 12 Mobile Price, Specification : ఇటీవలే చైనాలో విడుదలైన iQOO 12 స్మార్ట్ ఫోన్ ఈరోజు భారతదేశ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ మొట్ట మొదటిసారిగా Qualcomm Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌తో వచ్చిది. శక్తివంతమైన ఫీచర్స్ తో పాటు ఈ మొబైల్ గేమ్ అనుకూలంగా LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. గరిష్టంగా ఈ iQOO 12 స్మార్ట్ ఫోన్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఏయే స్పెసిఫికేషన్స్ లో లభిస్తుందో? ఈ మొబైల్ ధరేంటో? మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తోంది. 12GB ర్యామ్, 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 52, 999 కాగా.. బ్యాంక్ ఆఫర్స్ లో భాగంగా రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ పై అదనంగా రూ.2,000 వరకు బోనస్ కూడా పొందవచ్చు. దీంతో డిస్కౌంట్ ఆఫర్ పోను ఈ మొబైల్ కేవలం రూ.47,999 రూపాయలకే లభిస్తుంది. అలాగే అమెజాన్ ఈ స్మార్ట్ ఫోన్ పై 9 నెలల పాటు నో కాస్ట్ ఇఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది.
iQOO 12 స్పెసిఫికేషన్‌లు:
డిస్‌ప్లే:
iQOO 12 మొబైల్ 2800 × 1260 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 20:9 యాస్పెక్ట్ రేషియో, HDR10+, 144Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్టును కలిగి ఉంటుంది.
ప్రాసెసర్:
ఈ స్మార్ట్ ఫోన్ Adreno GPUతో వస్తోంది. దీంతోపాటు Qualcomm Snapdragon 8 Gen 3 SoC చిప్ సెట్ ని కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ చిప్‌తో పాటు, హ్యాండ్‌సెట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్, ప్రత్యేకమైన Q1 చిప్‌సెట్‌లతో వస్తోంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
RAM/స్టోరేజ్:
ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ 16GB RAM, 512GB ఇంటర్ ఇంటర్నల్ స్టోరేజ్ తో అందుబాటులో ఉంది.
OS:
iQOO 12 స్మార్ట్ ఫోన్ Android 14-ఆధారిత OriginOS 4.0 కస్టమ్ స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
కెమెరా:
iQOO 12 మొబైల్ f/1.68 ఎపర్చరు, OIS, LED ఫ్లాష్‌తో 50MP ఓమ్నివిజన్ OV50H ప్రైమరీ బ్యాక్ కెమెరా, f/2.57తో 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ Samsung JN1 కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 64MP 3x టెలిఫోటో కెమెరాతో 3x టెలిఫోటో కెమెరా, 100x డిజిటల్ జూమ్ సపోర్టుతో రాబోతోంది. 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
బ్యాటరీ:
ఇక ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే..120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ తో లభిస్తోంది.
ఇతర ఫీచర్స్:
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, హై-రెస్ ఆడియోతో లభిస్తోంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి