iQOO Z7 Pro 5G Price Cut: ప్రముఖ టెక్‌ బ్రాండ్‌ వివో సబ్‌ కంపెనీ ఐకూ మొబైల్స్‌ క్రమంగా మార్కెట్‌లో మంచి పేరు లభిస్తోంది. ఈ ఐకూ ప్రీమియం ప్రాసెసర్‌తో మొబైల్స్‌ని లాంచ్‌ చేయడంతో చాలా మంది గేమింగ్‌ కోసం ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే అతి తక్కువ ధరలోనే iQOO మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇటీవలే లాంచ్‌ అయిన iQOO Z7s 5G స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం అమెజాన్‌లో iQOO Z7s 5G స్మార్ట్‌ఫోన్‌ రెండు కలర్స్‌తో పాటు రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన ధర MRP రూ.24,999తో లభిస్తోంది. అయితే ప్రత్యేక సేల్‌లో భాగంగా 32 శాతం తగ్గింపుతో రూ.16,999కే అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. ICICI, HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లతో తయారు చేస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా వన్‌కార్ట్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.2,750 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను కేవలం రూ.14,249కే పొందవచ్చు. 


అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.16,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ పోను ఈ కొత్త iQOO Z7s 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.999కే పొందవచ్చు. దీంతో పాటు ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.


Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
పవర్ ఫుల్ ప్రాసెసర్ : iQOO Z7 Pro 5G మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం చాలా బాగుంటుంది.
సూపర్ స్మూత్ డిస్ప్లే (Super Smooth Display): 6.78-అంగుళాల FHD+ 3D AMOLED డిస్ప్లేతో అందుబాటులో ఉంది.  వీడియోలు, గేమ్‌లకు అద్భుతమైన అవుట్‌పుట్‌ను అందిస్తుంది.
5G కనెక్టివిటీ (5G Connectivity): లైట్నింగ్ ఫాస్ట్ 5G స్పీడ్‌తో డౌన్‌లోడ్‌లు, స్ట్రీమింగ్‌లు చేసేందుకు సహాయపడుతుంది. 
ఆకట్టుకునే కెమెరా: 64MP ఔరా లైట్ OIS అద్భుతమైన ప్రధాన కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.
ఫాస్ట్ ఛార్జింగ్ (Fast Charging): 4600mAh బ్యాటరీ, 66W ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.


Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి