Iqoo Z7 Pro 5G Pre Review: వివో సబ్‌ బ్రాండ్‌ iQoo త్వరలోనే భారత మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయబోతోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ iQoo Z7 Pro 5G పేరుతో  ఆగస్టు 31న విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మొబైల్‌ ఫోన్‌ హోల్-పంచ్ కటౌట్‌ డిస్‌ప్లేను కలిగి ఉండబోతోందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ 4,600mAh బ్యాటరీని ప్యాక్‌ను కలిగి ఉంటుందని సమచారం. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించిన మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇప్పటికే కంపెనీ  Amazon Indiaలోని మైక్రోసైట్ iQoo Z7 Pro 5G సంబంధించిన ఫీచర్లు, ధరకి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌ డిజైన్‌ విషయానికొస్తే..సరి కొత్త లుక్‌తో కనిపించబోతోంది. సెల్ఫీ కెమెరా కోసం స్క్రీన్‌పై కర్వ్డ్ డిస్‌ప్లేతో పాటు సెంటర్ హోల్-పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. కంపెనీ ఈ మొబైల్‌ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వివరించబోతున్నట్లు టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు. 


Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి


iQoo Z7 Pro 5G స్పెసిఫికేషన్‌లు:
ఇటీవలే కొందరు టెక్‌ నిపుణులు లీక్‌ చేసిన వివరాల ప్రకారం..iQoo Z7 Pro 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. కంపెనీ ఈ మొబైల్‌ ఫోన్‌ను మొదట రెండు వేరియంట్స్‌లో విడుదల చేయబోతున్నాడు. ఈ రెండు వేరియంట్స్‌ 8ర్యామ్‌ ,12ర్యామ్‌తో పాటు 128జిబి, 256జిబి రోమ్‌ని కలిగి ఉండబోతున్నాయి.  ఈ స్మార్ట్‌ఫోన్‌  4nm MediaTek డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌తో పాటు అనేక రకాల కొత్త ఫీచర్స్‌ లభించబోతున్నట్లు టెక్‌ నిపుణులు చెబుతున్నారు. 


iQoo Z7 Pro 5G డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఇందులో మొదటిది 64-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో రాబోతోంది. సెల్ఫీ, వీడియో చాట్ కోసం 16-మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,600mAh బ్యాటరీని కలిగి ఉంటుందని టెక్‌ నిపుణులు అంచాన వేస్తున్నారు.


Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి