iQOO Z9 Lite 5G Offer Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఐకూ నుంచి కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ లాంచ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా కంపెనీ అతి తక్కువ ధరల్లోనే మంచి గేమింగ్‌ మొబైల్స్‌ను లాంచ్‌ చేయడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఐకూ మరో ముందడుగు వేసింది. ప్రీమియం ఫీచర్స్‌తో iQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇది అతి శక్తివంతమైన ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ప్రస్తుతం 4 GB ర్యామ్‌తో పాటు 128 GB స్టోరేజ్‌, 6 GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లాంచ్‌ అయ్యింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాలు, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ iQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయితే భారత్‌లో విడుదలైన 5G ఫోన్స్‌లో అతిగా  చౌకైన పేరు పొందనుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానుంది. ఇక 6 GB ర్యామ్‌ వేరియంట్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ రూ 10,999 నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ను మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి బిల్‌ చెల్లించేవారికి రూ.500 నుంచి రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.


ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
ఈ మొబైల్‌ 6.56 అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు 1612x720 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుది. అలాగే ఈ డిస్ల్పే  840 nits గరిష్ట బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌తో వస్తోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌  6 GB రియల్ ర్యామ్‌తో పాటు 6 GB వరకు వర్చువల్ ర్యామ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులో వచ్చింది. ఇది Mali-G57 GPUతో కూడిన డైమెన్షన్ 6300 చిప్‌సెట్‌ను ప్రాసెసర్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఇతర ఫీచర్స్‌ వివరాలు:
రెండు ప్రధాన కెమెరాలు
50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా 
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ 
15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
LED ఫ్లాష్‌
Android 14 ఆధారంగా Funtouch OS 14
IP64 రేటెడ్ ఫోన్‌లో డ్యూయల్ సిమ్
5G, 4G LTE, Wi-Fi 5
బ్లూటూత్ 5.2, GPS కనెక్టీవిటీ


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి