COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Iqoo Z9S 5G Price: ప్రముఖ చైనీస్‌ కంపెనీ iQOO నుంచి మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ లాంచ్‌ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఐక్యూ ఈ స్మార్ట్‌ఫోన్‌ను iQOO Z9s పేరుతో విడుదల చేసింది. దీనిని కంపెనీ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ప్రారంభించింది. దీనికి సంబంధించిన మొదటి సేల్‌ కంపెనీ ఈ రోజు నుంచి ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇటీవలే లాంచ్‌ అయిన OnePlus Nord CE 4 Liteతో పోటీ పడుతోంది. ఈ మొబైల్‌ ప్రీమియం బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు  50MP Sony IMX882 OIS ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.


iQOO Z9s ధర, ఆఫర్స్‌:
ఈ iQOO Z9s స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇక వేరియంట్స్‌ వివరాల్లోకి వెళితే, ఈ 128GB స్టోరేజ్ ధర రూ.19,999లతో లభిస్తోంది. ఇక రెండవ వేరియంట్‌ 256GB స్టోరేజ్ ధర రూ.21,999తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు మూడవ స్టోరేజ్‌ వేరియంట్‌ 12GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్ ఆప్షన్‌తో రూ.23,999కే లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో Titanium Matte కలర్‌ ఆప్షన్‌ ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది. 


ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌ ఆఫర్స్‌లో భాగంగా ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఈ iQOO Z9s స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా  ICICI బ్యాంక్, HDFC బ్యాంక్ కార్డులతో పేమెంట్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుంత మార్కెట్‌లో బేస్‌ మోడల్‌ ధర రూ.17,999 కాగా ఈ బ్యాంక్‌ డిస్కౌంట్ పోను కేవలం రూ.15,999కే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ మొబైల్‌ త్వరలోనే ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. 


iQOO Z9s స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు:
మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్
HDR10+ సర్టిఫికేషన్
6.77-అంగుళాల 120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
1800nits లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌
వాటర్ రెసిస్టెంట్ కోసం IP64 రేట్
డ్యూయల్ కెమెరా బ్యాక్‌ సెటప్‌
50 మెగాపిక్సెల్ సోనీ IMX882 OIS ప్రైమరీ కెమెరా
Funtouch OS 14
5,500mAh బ్యాటరీ
44W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.