Iqoo Z9X 5G Price: ప్రముఖ చైనీస్‌ కంపెనీ ఐక్యూ (iQoo) స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ అంతో ఇంతో కాదు. ప్రీమియం ఫీచర్స్‌తో కూడి మొబైల్స్‌ను అతి తక్కువ ధరకే విక్రయిస్తూ వస్తోంది. దీంతో ఈ మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి ప్రజాదరణ లభించింది. అయితే దీనిని ఇలాగే కంటిన్యూ చేసేందుకు కంపెనీ అతి శక్తివంతమైన ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవలే లాంచ్‌ చేసింది. దీనిని కంపెనీ iQOO Z9x 5G పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ మొబైల్‌ మొదటి సేల్‌ మే 13వ తేది నుంచి ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మొబైల్స్‌ ప్రాముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌తో పాటు ఐక్యూ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ వివరాలు, ధర వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్‌ 6000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది దేశంలోనే అత్యంత శక్తివంతమైన Qualcomm Snapdragon 6 Gen 1 ప్రాసెసర్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌ డిస్ల్పే 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ బేస్ వేరియంట్‌ను కంపెనీ 8GB ర్యామ్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అలాగే ఇందులో 8MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఇందులో ఇతర ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 


మొదటి సేల్‌లో ఆఫర్స్‌:
ప్రస్తుతం మార్కెట్‌లో ఈ iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. మొదటి బేస్ వేరియంట్‌  4GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ మోడల్‌లో అందుబాటులోకి ఉండగా.. దీని ధర రూ.12,999 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇక రెండవ వేరియంట్‌ 6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రూ.15,999 నుంచి స్టార్ట్‌ కాబోతోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ను మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.


ఆఫర్స్‌ వివరాలు:
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, ఈ iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్‌ను SBI, ICICI బ్యాంక్ కార్డ్‌లను వినియోగించి బిల్ చెల్లించే వారికి రూ. 1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీంతో ప్రారంభ ధర రూ.11,999 అవుతుంది. దీంతో పాటు అదనంగా రూ. 500 వరకు డిస్కౌంట్‌ కూపన్‌ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి బిల్‌ చెల్లిస్తే మరింత తగ్గింపు ధరకే పొందవచ్చు. ప్రస్తుతం ఈ మొబైల్‌ స్టార్మ్ గ్రే, టోర్నాడో గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


iQOO Z9x 5G మొబైల్‌ ఫీచర్స్‌:
స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 SoC ప్రాసెసర్‌
6.72-అంగుళాల FHD+ IPS LCD స్క్రీన్‌
120Hz రిఫ్రెష్ రేట్‌
6,000 mAh బ్యాటరీ
రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్‌
44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌
Android 14-ఆధారిత Funtouch OS 14
50MP ప్రైమరీ సెన్సార్
2MP Bokeh కెమెరా
8MP సెల్ఫీ కెమెరా


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి