itel P55-itel P55+: రూ.10 వేల కంటే తక్కువ ధరలోనే 24GB ర్యామ్ 5G మొబైల్..దేశంలో ఏకైక స్మార్ట్ ఫోన్..
itel P55-itel P55+: ప్రముఖ చైనీస్ కంపెనీ త్వరలోనే itel P55, itel P55+ మోడల్స్‌ను విడుదల చేయబోంది. ఇప్పటికే కంపెనీ ఈ రెండు మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్‌ను కూడా వెల్లడించింది. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
itel P55-itel P55+: చైనీస్ టెక్ బ్రాండ్‌లకి మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని టెక్ కంపెనీలు అతి తక్కువ ధరలకే ప్రీమియం ఫీచర్స్ కలిగి మొబైల్‌ను తయారు చేసి విక్రయిస్తున్నాయి. చైనీస్ టెక్ కంపెనీ ఐటెల్ కూడా త్వరలోనే భారత మార్కెట్‌లో బడ్జెట్ ధరల్లో మరో రెండు స్మార్ట్ ఫోన్స్‌ను విడుదల చేయబోతోంది. కంపెనీ గత సంవత్సరంలో విడుదల చేసిన పవర్ సిరీస్ ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే..అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని itel P55, itel P55+ మోడల్స్‌ను లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించి ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ బడ్జెట్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ మొబైల్ డిస్ల్పే అధిక రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో పాటు ఇవి 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్‌ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా వర్చువల్ ర్యామ్‌ను పెంచుకునే ఫీచర్స్‌ను కూడా అందిస్తోందని తెలుస్తోంది. దీంతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.
itel P55, P55+ మొబైల్ స్పెసిఫికేషన్స్:
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ 90Hz డాట్-ఇన్ స్క్రీన్ 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ డిస్ల్పేలకు డైనమిక్ బార్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ మొబైల్స్ Unisoc T606 ప్రాసెసర్‌పై రన్ కాబోతున్నాయి. అలాగే ఆండ్రాయిడ్ T సాఫ్ట్‌వేర్ స్కిన్‌తో రాబోతున్నాయి. అలాగే కంపెనీ ఈ రెండు మొబైల్స్‌లో ఫేస్ అన్‌లాక్‌తో పాటు సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అందిస్తోంది. మొదట ఈ మొబైల్‌ను కంపెనీ మూన్‌లిట్ బ్లాక్, అరోరా బ్లూ, బ్రిలియంట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
ఈ స్మార్ట్ ఫోన్స్ బ్యాక్ సెటప్‌లో భాగంగా 50MP బ్యాక్ AI డ్యూయల్ కెమెరాను కలిగి ఉంటాయి. దీంతో పాటు ఫ్రాంట్‌లో 8MP (ఫ్రాంట్ కెమెరా)సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ రెండు మొబైల్స్ మోడల్స్ 5000mAh బ్యాటరీతో పాటు టైప్ సి ఛార్జింగ్ కెబుల్‌ను కలిగి ఉంటాయి. అలాగే మొదటి మోడల్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్, రెండవ మోడల్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటాయి. ఈ రెండు మొబైల్ ఫిబ్రవరి 13 నుంచి మార్కెట్‌లోకి అందుబాటలో రానున్నాయి. ప్రత్యేక ఆఫర్‌తో 128GB వేరియంట్ రూ. 6,999 కాగా..16GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.9,499తో రాబోతోంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter