COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio Phone Prima 2 Price: ప్రముఖ దేశీయ దిగ్గజం రిలయన్స్ జియో మార్కెట్‌లో కొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో, ప్రత్యేకమైన టెక్నాలిజీతో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ JioPhone Prima 2 4G పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. జియో తమ కస్టమర్స్‌కి దీపావళి కానుకగా అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్‌ ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌ బ్యాక్‌ సెటప్ లెదర్‌ ఫినింగ్‌ను కలిగి ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన కలర్‌ ఆప్షన్స్‌లో వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 
    
JioPhone Prima 2 4G ధర వివరాలు:

జియోఫోన్ ప్రైమా 2 మొబైల్‌ అద్భుతమైన ప్రెమ్‌తో బ్లూ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. జియో కంపెనీ ఈ దీనిని ధర రూ.2799తో విక్రయిస్తోంది. ఈ ఫోన్‌ ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ Amazonలో కూడా లభిస్తోంది. అంతేకాకుండా ఇది త్వరలో JioMart, Reliance Digitalలలో కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు ఈ మొబైల్‌ వివిధ స్మార్ట్‌ఫోన్‌ స్టోర్స్‌లలో కూడా లభించనుంది. 


డిజైన్, ఫీచర్స్:
ఈ JioPhone Prima 2 4G మొబైల్‌ ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్స్‌తో లాంచ్‌ అయ్యింది. ఇందులో యూట్యూబ్, ఫేస్‌బుక్ యాప్స్‌తో పాటు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి ప్రీమియం ఫీచర్స్‌ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ ఎంతో శక్తివంతమైన Kai-OS ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తుంది. అలాగే జియో కంపెనీ ఈ మొబైల్‌లో JioTV, JioCinema, JioSaavnలను ఫ్రీగా అందించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో జియో చాట్ అనే ఆప్షన్‌ కూడ అందుబాటులో ఉండబోతోంది. ఇక కంపెనీ వీడియో కాల్‌ మాట్లాడడానికి ప్రత్యేకమైన బ్యాక్‌, ఫ్రంట్‌ కెమెరాలను కూడా అందిస్తోంది. 


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


అంతేకాకుండా మ్యూజిక్‌ను ప్లే చేసేందుకు ప్రత్యేకమైన JioPay, సౌండ్ అలర్ట్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇది 2000mAh పెద్ద బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు  ఇందులో FM రేడియో ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే దీని బ్యాక్‌ సెటప్‌లో  LED టార్చ్ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది  2.4 అంగుళాల QVGA కర్వ్డ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఈ డిస్ప్లే  320x240 పిక్సెల్ రిజల్యూషన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది ARM Cortex A53 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. 


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.