Lava Agni 2 5G Smartphone to release on 2023 May 16: భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 'లావా' తన అగ్ని సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. లావా నుంచి విడుదల అయ్యే స్మార్ట్‌ఫోన్‌ 'లావా అగ్ని 2'. ఈ స్మార్ట్‌ఫోన్‌ సరసమైన ధరకే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండడమే కాకున్నా.. మార్కెట్‌లో తమ శ్రేణిలో ఉన్న అన్ని స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ లావా అగ్ని 2ని విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు పూర్తి చేసింది. మే 16 మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. లాంచ్ డేట్ రివీల్ కావడంతో జనాలు ఈ ఫోన్ కొనడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు కూడా లావా అగ్ని 2 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ స్మార్ట్‌ఫోన్ మీకు మంచి బిల్డ్ క్వాలిటీ మరియు టాప్ నాచ్ ఫీచర్‌లను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ఫీచర్స్ ఓసారి చూద్దాం. ఈ స్మార్ట్‌ఫోన్ మంచి ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది శక్తివంతమైన ఫోటోగ్రఫీకి ఉపయోగపడుతుంది. ఈ కెమెరా సెటప్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ క్వాడ్ కెమెరా సెటప్‌తో స్మార్ట్‌ఫోన్ డిజైన్ మరింత ప్రత్యేకంగా మరియు స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇది ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. 


లావా అగ్ని 2 స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరాసెటప్‌తో పాటు నైట్ ఫోటోగ్రఫీని మరింత మెరుగ్గా చేసే ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందించబడుతుంది. ఈ ఫోన్ ఫీచర్ లోడ్ చేయబడిన స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌గా ఉండబోతోంది. ఈ  స్మార్ట్‌ఫోన్‌ సరసమైన ధరకు అందుబాటులో ఉంటుంది. ఈ స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు 20 వేల రూపాయలు ఉండవచ్చు. అయితే మరో రెండు రోజుల్లో లావా అగ్ని 2 స్మార్ట్‌ఫోన్‌ అసలైన ధర తెలిసే అవకాశం ఉంది. 


అగ్ని 2 స్మార్ట్‌ఫోన్‌లో వినియోగదారులకు డబుల్ రీన్ఫోర్స్డ్ ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్ అందించబడుతుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 SoC ప్రాసెసర్ ఉంటుంది. ఇది తదుపరి స్థాయి పనితీరు కోసం వినియోగదారులకు ఉపదయోగపడుతుంది. దేశంలోనే ఈ ప్రాసెసర్‌తో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే. ఇది కాకుండా కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో పాటు 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఇవ్వబడుతుంది. మొత్తంమీద ఇది కస్టమర్లకు ప్రీమియం అనుభూతిని అందించే స్టైలిష్ మరియు హైటెక్ స్మార్ట్‌ఫోన్‌గా ఉండనుంది. 


Also Read: Suryakumar Yadav Century: పెళ్లాం ఉంటే కొట్టలేమన్నారు.. ఇప్పుడేమంటారు చెప్పండి! సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు  


Also Read: SRH vs LSG: టాస్ గెలిచిన సన్‌రైజర్స్‌.. జట్టులోకి కొత్త ఆల్‌రౌండర్‌! తుది జట్లు ఇవే


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.