Lava Blaze X 5G Dropped Price: మార్కెట్‌లో లావా మొబైల్స్‌కి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తోంది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లోనే లభించడం వల్ల చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటే లావా కంపెనీ కూడా ఎప్పటికప్పుడూ ప్రత్యేకమైన ఫీచర్స్‌తో కొత్త కొత్త మొబైల్స్‌ను లాంచ్‌ చేస్తూ వస్తోంది. ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన Lava Blaze X 5G మొబైల్‌ అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో విడుదలైంది. ఇది సరికొత్త డిజైన్‌తో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ అద్భుతమైన డిస్కౌంట్‌ను అందిస్తోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెజాన్‌లోని గ్రేట్‌ ప్రీడమ్‌ ఫెస్టివెల్‌ సేల్‌లో భాగంగా ఈ Lava Blaze X 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 10 నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఇది మార్కెట్‌లో మూడు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో కంపెనీ విడుదల చేసింది. ఇందులోని మొదటి వేరియంట్‌ 4GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఇక రెండవ వేరియంట్‌ 6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇక చివరి వేరియంట్‌ 8GB ర్యామ్‌, 128GB స్టోరేజ్‌తో వచ్చింది. ఇందులోని బేస్‌ వేరియంట్‌ మార్కెట్‌లో MRP ధర రూ.16,999తో అందుబాటులో ఉంది.


ప్రత్యేకమై సేల్‌లో భాగంగా ప్లాట్‌ డిస్కౌంట్ ఆఫర్‌ పోను ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.14,999కే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి పేమెంట్‌ చేసేవారికి డెడ్‌ చీప్‌ ధరకే ఈ లావా మొబైల్‌ను పొందవచ్చు. అయితే బ్యాంక్‌ ఆఫర్స్‌ చూస్తే ఈ Lava Blaze X 5G స్మార్ట్‌ఫోన్‌ను SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ. 1,500 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన ఆపర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో అన్ని బ్యాంక్‌ల డిస్కౌంట్ ఆఫర్స్‌ పోను రూ.13,499కే ఈ మొబైల్‌ను పొందవచ్చు. ఇవే కాకుండా పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.14,100 వరకు బోనస్‌ లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ అన్ని పోను రూ.899కే పొందవచ్చు.


Lava Blaze S5G స్మార్ట్‌ఫోన్ టాప్ ఫీచర్లు:
MediaTek Helio G37 ప్రాసెసర్
AI-పవర్డ్ కెమెరా సెటప్ కెమెరా
అద్భుతమైన డిస్‌ప్లే 
పెద్ద బ్యాటరీ కెపాసిటీ
ఒకే చార్జ్‌తో రోజంతా బ్యాటరీ లైఫ్
ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో పాటు మైక్రో SD కార్డ్‌
5G కనెక్టివిటీతో హై-స్పీడ్ ఇంటర్నెట్ ఎక్సీస్ 
 బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్లు


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.