Cheap And Best 5G Smartphones: ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ చాలా శరవేగంగా విస్తరిస్తోంది. ప్రతీ నెల ప్రతీ కంపెనీ నుంచి కనీసం రెండు లేదా మూడు మొబైల్స్.. లేదంటే ఒక్క మోడల్ అయినా మార్కెట్లోకి లాంచ్ అవుతోంది. దీంతో స్మార్ట్ ఫోన్ మేకింగ్ కంపెనీల మధ్య భారీ పోటీ నెలకొని ఉంది. స్మార్ట్ ఫోన్స్ మేకింగ్ కంపెనీల మధ్య పెరిగిపోతున్న పోటీ కారణంగా టెక్నాలజీ, లేటెస్ట్ ఫీచర్స్ కొత్తగా యాడ్ అవుతున్నప్పటికీ.. ధరలు మాత్రం కొంత తగ్గి వస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్‌తో లభించే స్మార్ట్ ఫోన్లపై ఓ స్మాల్ లుక్కేద్దాం రండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెక్నో పొవా 5 ప్రో ఫోన్ ..
టెక్నో పొవా 5 ప్రో ఫోన్ ధర రూ. 14,999 కాగా ఈ ఫోన్ వెనుక భాగంలో 50 MP + 0.8 MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నాయి. 16 MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తోంది. 


ఐకూ Z6 లైట్ 5G ఫోన్.. 
ఐకూ Z6 లైట్ 5G ఫోన్ ధర రూ. 14,495 గా ఉండగా.. ఫోన్ వెనుక భాగంలో 50 MP + 2 MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నాయి. ముందు భాగంలో అందమైన సెల్ఫీల కోసం 8 MP కెమెరాను బిగించారు. యధావిధిగా చాలా ఫోన్ల తరహాలోనే ఇందులో కూడా 5000mAh బ్యాటరీ ఉంది. 


శాంసంగ్ గెలాక్సీ M14 ఫోన్ ..
శాంసంగ్ గెలాక్సీ M14 ఫోన్ ధర రూ. 13,448 కాగా ఈ ఫోన్ 50 MP + 2 MP + 2 MP త్రిపుల్ కెమెరా సెటప్ తో రూపొందింది. ముందు భాగంలో అందమైన సెల్ఫీల కోసం 13 MP ఫ్రంట్ కెమెరా అమర్చారు. 6000mAh బ్యాటరీ ఉన్నాయి. 


శాంసంగ్ గెలాక్సీ A14 5G ఫోన్ ..
శాంసంగ్ గెలాక్సీ A14 5G ఫోన్ ఖరీదు రూ. 15,490 కాగా ఇందులో 50 MP + 2 MP + 2 MP త్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. ముందు భాగంలో అందమైన సెల్ఫీల కోసం 13 MP ఫ్రంట్ కెమెరా అమర్చారు. 5000mAh బ్యాటరీ ఉన్నాయి. ఒక్క బ్యాటరీ విషయంలో మినహాయిస్తే.. శాంసంగ్ గెలాక్సీ A14 5G ఫోన్ కి, శాంసంగ్ గెలాక్సీ M14 ఫోన్ దగ్గరి పోలికలు ఉన్నాయి.


ఇది కూడా చదవండి : Realme C51 Phone: 8 వేల లోపే అధ్భుతమైన ఫీచర్స్ ఉన్న ఫోన్.. స్పెసిఫికేషన్స్ మీరే చూడండి


శాంసంగ్ గెలాక్సీ F14 5G ఫోన్ ..


ఈ ఫోన్ ధర రూ13,990 కాగా ఫోన్ వెనుక భాగంలో 50 MP మెయిన్ కెమెరా, మరొక 2 MP కెమెరా ఉన్నాయి. 13 MP ఫ్రంట్ కెమెరాతో వస్తోన్న ఈ శాంసంగ్ గెలాక్సీ F14 5G ఫోన్ లో 6000 mAh బ్యాటరీని అమర్చారు.


ఇది కూడా చదవండి : iPhone 14 Stolen By Woman: సెక్యురిటీ వైర్ కొరికేసి మరీ ఐ ఫోన్ చోరీ.. వీడియో వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి