COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Moto Edge 40 Price: ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్లు ప్రీమియం ధరల్లో లభిస్తే.. మరికొన్ని మాత్రం బడ్జెట్ ధరల్లోనే లభిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ ధరల్లో లభించే స్మార్ట్ ఫోన్ లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతే కాకుండా యువత కూడా వాటిని కొనుగోలు చేసేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటీవలే ప్రముఖ టెక్ బ్రాండ్ మోటో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ కి మార్కెట్లో ప్రత్యేక డిమాండ్ లభించింది. దీనిని గుర్తించిన ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి ప్రత్యేక సేవలో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ పై అదనపు తగ్గింపుతో విక్రయిస్తోంది. 


ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో Moto Edge 40 అత్యంత వేగంగా విక్రయమవుతోంది. ఫ్లిప్కార్ట్ అందిస్తున్న దీపావళి ప్రత్యేక సేల్‌లో భాగంగా రూ. 8,000 కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా మోటో ఎడ్జ్ 40 స్మార్ట్ ఫోన్ పై అదనపు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఎలా కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే పొందవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


మోటో ఎడ్జ్ 40ని అత్యంత చౌకగా కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. 256 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్‌ కలిగిన వేరియంట్ రూ.34,999కు లభిస్తోంది. అయితే ఈ దీవాలి సేల్‌లో భాగంగా మీరు ఈ స్మార్ట్ ఫోన్ ని 22% తగ్గింపుతో రూ.26,999కే పొందవచ్చు. అంతేకాకుండా కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్ బి ఎల్ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు ను వినియోగించి 5 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.
 
అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా ఎక్స్చేంజ్ చేసి రూ.24,830 వరకు తగ్గింపు పొందవచ్చు. మీరు ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ను వినియోగిస్తే దాదాపు రూ.3,000లోపే మీరు ఈ స్మార్ట్ ఫోన్ పొందవచ్చు. అయితే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ మీరు ఎక్స్చేంజ్ చేసే పాత స్మార్ట్ ఫోన్ పై ఆధారపడి ఉంటుంది. మొబైల్ కండిషన్ బాగుంటే పై డిస్కౌంట్ లభిస్తుంది.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  
స్పెసిఫికేషన్‌:
MediaTek డైమెన్సిటీ 8020 ప్రాసెసర్‌
6.55 అంగుళాల pOLED 3D కర్వ్డ్ ఫుల్ HD+ డిస్‌ప్లే
13 ఆధారిత సాఫ్ట్‌వేర్ 
144Hz రిఫ్రెష్ రేట్‌
డ్యూయల్ స్టీరియో స్పీకర్లు
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)
50MP ప్రైమరీ లెన్స్
 13MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌
32MPసెల్ఫీకెమెరా
4000mAh కెపాసిటీ బ్యాటరీ
15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.