Moto G04 Price In India: మన దేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరు తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉండే ఫోన్స్ కొనుగోలు చేయాలనుకుంటారు. మెుబైల్స్ కంపెనీలన్నీ కూడా మిడల్ క్లాస్ పీపుల్ నే టార్గెట్ చేసుకుని ఫోన్స్ లాంచ్ చేస్తాయి. స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య పోటీ పెరిగి అధునాత ఫీచర్లు ఉన్న ఫోన్స్ కూడా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ప్రముఖ స్మార్ ఫోన్ దిగ్గజం మోటో నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రాబోతుంది. దీని ధర పదివేల లోపే ఉండొచ్చని అంచనా. మోటో జీ04 అనే 5జీ స్మార్ట్‌ఫోన్ ఈనెలలో ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ విడుదల చేయబోతున్నారు. ఈనేపథ్యంలో దీని యెుక్క ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫీచర్స్
--> ఈ స్మార్ట్‌ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్‌తోపాటు 6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ పంచ్ హోల్ డిస్‌ప్లేతో వస్తుంది. దీని డిస్‌ప్లే హై బ్రైట్‌నెస్ మోడ్‌ను కలిగి ఉంది. బ్రైట్‌నెస్ 537 నిట్స్ వరకు పెంచుకోవచ్చు. 
--> ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రాబోతుంది. 
--> ఈ మెుబైల్ కాంకర్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ, సన్‌రైజ్ ఆరెంజ్ రంగుల్లో లభించనుంది.
--> ఈ స్మార్ట్‌ఫోన్ యూనిసాక్ టీ 606 చిప్‌సెట్‌తో పనిచేయనుంది. 
--> 4GB RAM + 64GB స్టోరేజ్ రూ. 6,999కి, 8GB RAM మరియు 128GB స్టోరేజ్ రూ.7,999కి రాబోతుంది.
--> ఇందులో డాల్బీ అట్మోస్ కూడా ఉంది. 8 జీబీ ర్యామ్ ను 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. అలాగే 128 జీబీ యూఎఫ్‌ఎస్ 2.2 స్టోరేజ్ వరకు బ్యాకప్ చేసుకోవచ్చు. అలాగే డెడికేటెడ్ మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ని 1టీబీకు మరింత విస్తరించవచ్చు.
--> ఈ ఫోన్ క్వాడ్ ఫిక్సల్ కలిగిన 16MP ఏఐ కెమెరాతో రాబోతుంది. ఫ్రంట్ కెమెరాను 5మెగాఫిక్సల్ తో తీసుకొస్తున్నారు. 
--> అంతేకాకుండా ఇది 5000mAh బ్యాటరీతో వస్తుంది. IP52 కూడా ఉంది. 


Also Read: Work From Home Jobs: ఈ ఏడు కంపెనీల్లో శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు


Also Read: Cash Without ATM: ఇక ఏటీఎం లేకుండానే ఓటీపీతో డబ్బులు తీసుకోవచ్చు, ఎలాగో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter