Motorola Edge 40 Neo Huge Price Reduced: ఎక్కువ ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలని ఫ్లాన్‌ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కాబోయే మొబైల్ బొనాంజా సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్‌ని భారీ తగ్గింపుతో అందించబోతోంది.  ఈ సేల్‌లో భాగంగా కొన్ని మొబైల్స్‌పై ప్రత్యేక డీల్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్స్‌లో 20 వేల లోపు ఉండే మొబైల్స్‌ ధరలు భారీగా తగ్గనున్నాయి. దీంతో పాటు కర్వ్డ్ డిస్‌ప్లే కలిగిన Motorola Edge 40 Neo మొబైల్‌ ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో లభించనుంది. అంతేకాకుండా దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందుబాటులో ఉంచబోతోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌పై ఉండే ప్రత్యేకమైన ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ Motorola Edge 40 Neo స్మార్ట్ ఫోన్‌ రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌, నాలుగు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. 128జిబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర MRP రూ. 27,999 కాగా ప్రత్యేక ఈ మొబైల్ బొనాంజా సేల్‌లో భాగంగా 17శాతం తగ్గింపుతో కేవలం రూ. 22,999కే లభిస్తోంది. దీంతో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటలో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే  ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్  క్రెడిట్‌పై 5 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


ఫ్లిప్‌కార్ట్ ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీని కోసం మీరు వినియోగిస్తున్న పాత కండీషన్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేసి కొనుగోలు చేస్తే దాదాపు రూ.18,500 వరకు బోనస్‌ కూడా లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను ఈ Motorola Edge 40 Neo మొబైల్‌ కేవలం రూ.4,499కే పొందవచ్చు. దీంతో పాటు ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటి కోసం ఫ్లిప్‌కార్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాల్లోకి వెళితే..IP68 రేటింగ్‌తో 6.55 అంగుళాల pOLED కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు 50 మెగాపిక్సెల్ ఫ్రాంట్‌ కెమెరాతో అందుబాటులో ఉంది. 


ఇక 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 12GB ర్యామ్‌ కలిగిన Motorola Edge 40 Neo మొబైల్‌పై కూడా ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. ఈ మొబైల్‌పై 10 శాతం బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్స్‌ తగ్గింపు పొందడమే కాకుండా..ఫ్లిప్‌కార్ట్‌ అదనంగా రూ.24,999 వరకు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. దీంతో పాటు అదనంగా 16 శాతం ఫ్లాట్‌ తగ్గింపు కూడా లభిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ కేవలం Peach Fuzz కలర్‌ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter