Motorola Edge 50 Neo: 50MP కెమెరాతో కొత్త మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ రాబోతోంది.. ఫీచర్స్ లీక్..
Motorola Edge 50 Neo: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లో కొత్త Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన ప్రాసెసర్‌తో రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Motorola Edge 50 Neo: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటరోలా మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ అతి తక్కువ ధరల్లోనే ఎప్పటికప్పుడు ప్రీమియం ఫీచర్స్ కలిగి స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేస్తూ వస్తోంది. అయితే అతి త్వరలోనే మోటరోలా ఎడ్జ్ 50 నియో పేరుతో మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో రానుంది. దీంతో పాటు ఎంతో శక్తివంతమైన ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం డిజైన్‌తో పాటు ప్రత్యేకమైన కలర్ ఆప్షన్‌లో రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Motorola Edge 50 Neo స్పెసిఫికేషన్స్:
ఈ Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన వివరాలను టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ సోషల్ మీడియా పంచుకున్నారు. ఇది 6.4-అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ల్పే సెటప్‌తో రానుంది. ఈ మొబైల్ MediaTek Dimensity 7300 చిప్‌సెట్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన 50MP ప్రధాన కెమెరాతో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు 13MP సెకండరీ కెమెరా, 10MP అదనపు సెన్సార్ సెటప్‌ను రాబోతోంది.
అలాగే ఈ మొబైల్ Android 14పై రన్ రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 32MP ఫ్రంట్ కెమెరా, 4,310mAh బ్యాటరీలను కలిగి ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో రానుంది. దీంతో పాటు IP68 రేటింగ్ సెటప్ కూడా ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్ అయిన ఎడ్జ్ 50 నియో ఎడ్జ్ 40 నియోని పోలి ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు అనేక రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
మోటరోలా ఎడ్జ్ 50 నియో టాప్ లీక్ అయిన ఫీచర్లు:
1. అద్భుతమైన డిస్ప్లే:
6.4 అంగుళాల pOLED డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
1.5K రిజల్యూషన్
HDR10+ సపోర్ట్
2500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
2. శక్తివంతమైన ప్రాసెసర్:
MediaTek Dimensity 7300 చిప్‌సెట్
3. అద్భుతమైన కెమెరా సిస్టమ్:
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
50MP ప్రధాన కెమెరా
13MP అల్ట్రా-వైడ్ కెమెరా
10MP మాక్రో కెమెరా
30fps వద్ద 4K వీడియో రికార్డింగ్
32MP ఫ్రంట్ కెమెరా
4. బ్యాటరీ:
4,310mAh బ్యాటరీ
125W టర్బో ఛార్జింగ్ సపోర్ట్
50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
10W రివర్స్ ఛార్జింగ్
5. స్టాక్ ఆండ్రాయిడ్:
Android 14 తో స్టాక్ ఆండ్రాయిడ్
3 సంవత్సరాల OS అప్‌డేట్‌లు మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
6. ఇతర ముఖ్య లక్షణాలు:
డ్యూయల్ సిమ్ 5G
Wi-Fi 6E
బ్లూటూత్ 5.2
NFC
హై-రిజల్యూషన్ ఆడియో
ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి