Motorola g64 5G Price: అత్యంత తగ్గింపుతో మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది గుడ్‌ న్యూస్‌.. ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రీమియం మొబైల్స్‌పై అత్యధిక తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా వాటిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ తగ్గింపు కూడా లభిస్తోంది. ముఖ్యంగా మోటో విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్స్‌ అత్యధిక తగ్గింపు ధరల్లో లభిస్తున్నాయి. దీంతో పాటు అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా ఏ స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక తగ్గింపుతో అందుబాటులో ఉందో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం మార్కెట్‌లో Motorola g64 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఇది మార్కెట్‌లో రూ.19,999తో అందుబాటులో ఉంది. దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి 15 శాతం తగ్గింపుతో కేవలం రూ.16,999కే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్‌ కూడా లభిస్తోంది. అలాగే దీనిపై నో కాస్ట్ EMI ఆప్షన్‌ కూడా లభిస్తోంది. 


ఈ మొబైల్‌ను నో కాస్ట్ EMI ఆప్షన్ ద్వారా కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి 3 నెలలు లేదా 6 నెలల పాటు EMI ఫ్లాన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే నోకాస్ట్ EMI ఆప్షన్‌ లభిస్తుంది. ఈ ప్రత్యేకమైన ఆఫర్స్‌ కేవలం 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన మొబైల్‌పై మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే దీనిపై కాంబో ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని తెలుసుకోవడానికి ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 


ఈ Motorola g64 5G స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ను డెడ్ చీప్‌ ధరకే పొందవచ్చు. ఈ ఆఫర్‌తో కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.16,999 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ అనేది పాత మొబైల్‌ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. కండీషన్‌ బాగుంటేనే ఈ తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను  ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.599లోపే పొందవచ్చు.  


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
డిస్‌ప్లే: 6.5-ఇంచెస్ ఫుల్ HD+ LCD డిస్‌ప్లే
ప్రాసెసర్: MediaTek Dimensity 7020 5G చిప్‌సెట్
రామ్ & స్టోరేజ్: 8GB RAM + 128GB స్టోరేజ్ (మైక్రో SD కార్డ్‌తో విస్తరించబడుతుంది)
కెమెరాలు: 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, మరియు 2MP మాక్రో సెన్సార్తో కూడిన ట్రిపుల్ రెయర్ కెమెరాలు. ఫ్రంట్‌లో 16MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 5000mAh ఫాస్ట్ చార్జింగ్‌తో కూడిన నాన్-రెమూవబుల్ బ్యాటరీ
ఆపరేటింగ్ సిస్టమ్: Android 13- ఆధారిత MyUX
కనెక్టివిటీ: 5G, 4G LTE, Wi-Fi, Bluetooth, GPS, USB-C
సెన్సర్లు: ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, కాంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.