Flipkart offers: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు భారీ డిస్కౌంట్ ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. ఇటీవల మార్కెట్‌లో లాంచ్ అయిన మోటోరోలా జి64 5జి స్మార్ట్‌ఫోన్ ధర రెండు నెలల్లోనే తగ్గిపోయింది. ఇప్పుడు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Motorola G64 అనేది 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో 1080/2400 పిక్సెల్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కంపెనీ గొరిల్లా గ్లాస్ అమర్చింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఉంటుంది. బ్లూటూత్ 5.3, వైఫై సపోర్ట్ చేస్తుంది. ఐపీ 52 రేటింగ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. 


Motorola G64లో గరిష్టంగా 12 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం ఉంటుంది. దీంతోపాటు 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ ఫోన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కలిగి ఉంది. ఇది కాకుండా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా ఉంది. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఇచ్చారు. 


ఈ ఫోన్ అసలు ధర 17,999 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్‌లో 22 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దాంతో కేవలం 13,999 రూపాయలకే అందుబాటులో వచ్చింది. ఇక ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్జులతో కొనుగోలు చేస్తే మరో 1000 రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. అంటే 12,999 రూపాయలకే లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అయితే అదనంగా మరో 5 శాతం లభిస్తుంది. దాంతో ఈ ఫోన్ కేవలం 12,499 రూపాయలకే లభించనుంది. 


Also read: IMD Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, రానున్న 4-5 రోజులు విస్తారంగా వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook