Motorola Edge 50 Ultra: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చాలా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. చాలాకాలం నుంచి నమ్మకమైన, మన్నిక కలిగిన బ్రాండ్‌గా మోటోరోలా ప్రత్యేకత నిలుపుకుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఏకంగా 50 మెగాపిక్సెల్ మూడు కెమేరాలతో కొత్త ఫోన్ లాంచ్ చేసి అందర్నీ ఆశ్చర్యపర్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా కొత్తగా భారతీయ మార్కెట్‌లో నిన్న జూన్ 18న లాంచ్ అయింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో, ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్ కాగా ఇప్పుడు ఇదే సిరీస్ కొనసాగింపుగా మోటోరోలా ఎడ్జ్ అల్ట్రా విడుదలైంది. ఇందులో ఫీచర్లు అన్నీ అప్‌గ్రేడ్ అయున్నాయి. ఫోన్ వెనుక భాగం వుడెన్ ప్యానెల్ కావడం విశేషం.


మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ పుల్ హెచ్‌డి ప్లస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2500 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉండటం వల్ల రిజల్యూషన్, పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉండనుంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ అమర్చింది కంపెనీ. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా స్నాప్‌డ్రాగన్ 8 ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 125 వాట్స్ టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ అయితే 50 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 12జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. ఈ ఫోన్‌లో మోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా ఎడాప్టివ్ స్టెబిలైజేషన్, ఆటో ఫోకస్ ట్రాకింగ్ , యాక్షన్ షాట్ వంటి ఫీచర్లు కలిగి ఉంటాయి. డాల్బీ ఎట్మాస్ సపోర్ట్‌తో ఉంటుంది. ఐపీ68 రేటింగుతో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంది. 


మోటోరోలా ఎడ్జ్ 50 బ్లూటూత్ 5.4, వైఫై 7, ఎన్‌ఎఫ్‌సి, యూఎస్‌బి ఛార్జింగ్ సి పోర్ట్, డ్యూయల్ సిమ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇక అన్నింటికంటే ప్రత్యేక కెమేరా ఫీచర్లు. ఇందులో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ కెమేరాతో పాటు మరో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఆటో ఫోకస్ లెన్స్ , 64 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ టెలీఫోటో కెమేరా కలిగి ఉంటుంది. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం ఇంకో 50 మెగాపిక్సెల్ కెమేరా ఇచ్చారు. 


మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 59,999 రూపాయలుగా ఉంది. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌లో భాగంగా 5000 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. కొన్ని సెలెక్టెడ్ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే మరో 5000 డిస్కౌంట్ పొందవచ్చు. అంటే 49,999 రూపాయలకే ఈ ఫోన్ లభిస్తుంది. జూన్ 24 నుంచి అమ్మకాలు ప్రారంభమౌతాయి.


Also read: Supreme Court on NEET Row 2024: తప్పు జరిగితే ఒప్పుకోవల్సిందే, ఎన్టీయేకు సూచించిన సుప్రీంకోర్టు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook