COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Noise Colorfit Caliber 3 Price: ప్రముఖ టెక్‌ కంపెనీ నాయిస్‌ నుంచి మరో స్మార్ట్ వాచ్‌ విడుదలైంది. కంపెనీ నాయిస్ కలర్‌ఫిట్ కాలిబర్ 3 పేరుతో మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ వాచ్‌ అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. అతి తక్కువ ధరలోనే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో కలిగిన స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే తప్పకుండా ఈ నాయిస్ కలర్‌ఫిట్ కాలిబర్ 3ని చూస్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్‌ అద్భుతమైన AMOLED డిస్‌ప్లేతో హార్ట్‌ రేట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. 


ఈ స్మార్ట్‌ వాచ్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ వాచ్‌ 5 కలర్స్‌లో లభిస్తోంది.  కంపెనీ ఈ స్మార్ట్ వాచ్‌ MRP రూ.6,999కు విక్రయిస్తోంది. అయితే విడుదల సందర్భంగా ఈ వాచ్‌పై కంపెనీ ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు 64 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ డిస్కౌంట్‌ పోను మీరు రూ.2,499కే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ వాచ్‌కి సంబంధించిన ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
ఈ నాయిస్ కలర్‌ఫిట్ కాలిబర్ 3 వాచ్‌లో 1.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే ఎప్పుడూ ఆన్‌లో ఉండే విధంగా కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. విడుదలైన స్మార్ట్ వాచ్‌ బ్లూటూత్ కాలింగ్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ వాచ్‌ నోయిస్ ట్రూ సింక్ టెక్నాలజీతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌వాచ్‌ 24x7 హార్ట్‌ బీట్ సెన్సార్‌ మానిటర్, SpO2 సెన్సార్, స్లీపింగ్‌ ట్రాకింగ్, 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను కూడా అందిస్తోంది. 


ఈ నాయిస్ కలర్‌ఫిట్ కాలిబర్ 3 స్మార్ట్ వాచ్‌  చాలా శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ వాచ్‌ని ఒకసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల పాటు లైఫ్‌ను ఇస్తుంది. దీంతో పాటు బ్లూటూత్ కాలింగ్‌తో, నోటిఫికేషన్ డిస్‌ప్లే, రిమైండర్, అలారం, కెమెరా కంట్రోల్‌, మ్యూజిక్‌ కంట్రోల్‌, కాలిక్యులేటర్‌, వెదర్‌ రిపోర్ట్‌ వంటి చాలా రకాల ఫీచర్స్‌ను కలిగి ఉంది. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook