NoiseFit Force Smartwatch: ప్రముఖ ఎలక్ట్రిక్‌ కంపెనీ నాయిస్ మార్కెట్‌లోకి  మరో స్మార్ట్‌ వాచ్‌ను విడుదకానుంది.  నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 ఆల్ఫా అనే మోడల్‌తో ఇదే నెలలో లాంచ్‌ చేయబోతునట్లు కంపెనీ పేర్కొంది. అయితే బడ్జెట్‌ మంచి వాచ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన స్మార్ట్‌ వాచ్‌గా చెప్పొచ్చు. ఈ వాచ్‌  ఏ పరిస్థితిలోనైనా, ఏ వాతావరణంలోనైనా చక్కగా పని చేస్తుంది. ఈవాచ్‌కు సంబంధించి ఫీచర్లు, ధరలు, ఇతర వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ స్మార్ట్‌ వాచ్‌కి బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్  కూడా ఉంది. ఇది బిల్ట్-ఇన్ జీపీఎస్‌తో పాటు నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 జీపీఎస్‌ కూడా అందుబాటులో ఉండనుంది. అయితే ఈ స్మార్ట్‌ వాంచ్‌లో చాలా రకాల కొత్త ఫీచర్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రముఖ ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌లో లభించే అవకాశాలున్నాయి.


NoiseFit Force వివరాలు:
ఇది అన్ని వాచ్‌లా కాకుండా చాలా రకాల కొత్త ఫీచర్లతో మార్కెట్‌లోకి విడుదల కాబోతోందని తెలుస్తోంది. ఇక డిజైన్‌ విషయానికొస్తే శాంసంగ్‌ వాచ్‌ డిజైన్‌లా ఉండబోతోందని సమాచారం. గడియారం రెండు వైపులా బటన్ల ఫంక్షన్స్‌తో పని చేయనుంది. 360x360-పిక్సెల్ రిజల్యూషన్‌తో 1.32-అంగుళాల డిస్‌ప్లే మార్కెట్‌లోకి రాబోతోంది. ఈ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో పాటు ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్‌లు, కాల్ లాగ్‌లకు యాక్సెస్, డయల్ ప్యాడ్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది.  రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ స్పోర్ట్స్ మోడ్ ఫీచర్లతో అందుబాటులోకి రాబోతోంది.


ఇతర ఫీచర్లు:
స్మార్ట్ వాచ్ HR సెన్సార్
స్టెప్ ట్రాకర్
స్లీప్‌ ట్రాకింగ్
SpO2 మానిటర్‌
వారం వరకు ఛార్జ్‌
BT కాలింగ్ ఫీచర్
NoiseFit యాప్
AI వాయిస్ అసిస్టెంట్
సెడెంటరీ రిమైండర్
కెమెరా కంట్రోల్
రిమైండర్‌లు


NoiseFit Force ధర:
ఇక ఈ వాచ్‌ ధర విషయానికొస్తే..రూ. 2 వేల కంటే తక్కువ ధరలోనే లభించే అవకాశాలున్నాయని  సమాచారం. అయితే ఈ వాచ్‌ సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అంతేకాకుండా లాంఛ్ అయిన తర్వాత మరికొన్ని ఫీచర్లు తెలిసే అవకాశాలున్నాయి.


Also Read:  Jamuna Death : జమున మరణం.. చిరు, బాలయ్య, పవన్ సంతాపం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్


Also Read: KGF Vasishta Wedding : నాని హీరోయిన్‌ను పెళ్లాడిన కేజీయఫ్ నటుడు వశిష్ట.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook