Nokia C32 5G Smartphone: నోకియా నుంచి అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్.. డిజైన్ని చూసి ఫిదా అవుతున్న జనాలు!
Nokia C32 5G Smartphone Launch and Price @ India. ఈ ఏడాది `నోకియా` మొబైల్ సంస్థ భారతీయ మార్కెట్లో వరుసగా కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది.
Nokia C32 5G Smartphone Launch and Price @ India: ఈ ఏడాది 'నోకియా' మొబైల్ సంస్థ భారతీయ మార్కెట్లో వరుసగా కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. గతంలో కలిగి ఉన్న అగ్ర స్థానాన్ని తిరిగి పొందడమే నోకియా లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే కంపెనీ భారత మార్కెట్లోకి చాలా ఫోన్‌లను తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే నోకియా కంపెనీ భారతదేశంలో మరో ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఆ ఫోన్ పేరు 'నోకియా సీ32' (Nokia C32). 2023 ఫిబ్రవరిలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సందర్భంగా కంపెనీ ఈ ఫోన్‌ను పరిచయం చేసింది. ఆ సమయంలోనే ఈ ఫోన్ యూకేలో లాంచ్ అయింది. త్వరలో ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావాలని నోకియా ప్లాన్ చేస్తోంది. నోకియా సీ32 ధర మరియు రిలీజ్ డేట్ వివరాలను ఓసారి చూద్దాం.
Nokia C32 Price:
91మొబైల్స్ నివేదిక ప్రకారం... నోకియా C32 స్మార్ట్‌ఫోన్ మే 23న భారతదేశంలో విడుదల కానుంది. నోకియా పవర్ ఫుల్ ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకురానుంది. భారత దేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ. 9999గా ఉంటుందని పేర్కొంది. అయితే ధర ఎక్కువ ఉంటుందా? లేక తక్కువ ఉంటుందా? అనేది ఇంకా స్పష్టం కాలేదు. రేపటి వరకు ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు తెలియరానున్నాయి.
Nokia C32 Specifications:
నోకియా C32 స్మార్ట్‌ఫోన్ 720×1600 పిక్సెల్‌ల HD+ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 20: 9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. వాటర్‌డ్రాప్ నాచ్‌లో ఫ్రంట్ కెమెరాకు ఇందులో చోటు ఉంది. నోకియా C32 ఫోన్ UniSoC SC9863A ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇందులో 4GB RAM మరియు 128GB వరకు ఉంటుంది. అదనంగా 3GB వరకు మెమరీ విస్తరణ ఎంపిక ఉంటుంది. ఈ ఫోన్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.
Nokia C32 Camera:
నోకియా C32 ఫోన్ డ్యూయల్-రియర్ కెమెరా కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది. ఇది 2MP సెన్సార్‌తో పాటు 50MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. నోకియా C32లో శక్తివంతమైన 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ద్వారా 10W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.
Nokia C32 Features:
నోకియా C32 ఫోన్ IP52 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. ఇది దుమ్ము మరియు స్ప్లాష్ రెసిస్టెంట్‌గా పని చేస్తుంది. అదనంగా హ్యాండ్‌సెట్ ప్రత్యేక మైక్రో SD కార్డ్ స్లాట్‌ను కలిగి ఉంటుంది. క్లాసిక్ 3.5mm ఆడియో జాక్ ఇందులో ఉంటుంది. కనెక్టివిటీ పరంగా ఇది డ్యూయల్-సిమ్ సపోర్ట్, 4G, WiFi, బ్లూటూత్ 5.2, GPS మరియు GLONASS సామర్థ్యాలను కలిగి ఉంటుంది.
Also Read: Second Hand Car Benfits: సెకండ్ హ్యాండ్ కారు కొనడం వల్ల కలిగే ఈ 4 ప్రయోజనాలు మీకు తెలుసా?
Also Read: Pooja Hegde Thigh Pics: రెడ్ డ్రెస్‌లో పూజా హెగ్డే.. సమ్మర్‌లో హీటు పెంచేస్తోన్న బుట్టబొమ్మ!
అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.