Nothing Phone 2 Launch Date in India 2023: 'నథింగ్‌' నుంచి గత ఏడాది ఆకర్షణీయమైన డిజైన్‌, ఫీచర్లతో తొలి స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయిన విషయం తెలిసిందే. రెండో స్మార్ట్‌ఫోన్‌ను కూడా తీసుకొచ్చేందుకు నథింగ్‌ సిద్ధమవుతోంది. నథింగ్‌ ఫోన్‌ 2 (Nothing Phone 2) 2023 జులైలో మార్కెట్‌లోకి వస్తోంది. ఈ విషయాన్ని నథింగ్‌ కంపెనీ సీఈఓ కార్ల్‌ పే తెలిపారు. నథింగ్‌ ఫోన్‌ 2 కూడా ఆకర్షణీయమైన డిజైన్‌, బలమైన బ్యాటరీని కలిగి ఉంటుంది. నథింగ్‌ ఫోన్‌ 2 మరిన్ని వివరాలను ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nothing Phone 2 Battery: నథింగ్‌ ఫోన్‌ 1తో పోలిస్తే నథింగ్‌ ఫోన్‌ 2లో బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచినట్లు కార్ల్‌ పే తెలిపారు. నథింగ్‌ ఫోన్‌ 1లో 4,500mAh బ్యాటరీ ఉండగా.. నథింగ్‌ ఫోన్‌ 2లో 4,700mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్‌ను అమెరికాలో కూడా విడుదల చేయనున్నట్లు నథింగ్‌ కంపెనీ సీఈఓ కార్ల్‌ పే తెలిపారు. ఫోన్‌ 1ను అమెరికా మార్కెట్‌లో ప్రవేశపెట్టలేదు. అయితే ఎంపిక చేసిన యూఎస్‌ కస్టమర్స్‌కు బీటా ప్రోగ్రాం కింద 299 డాలర్లకు 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఉన్న బ్లాక్‌ కలర్‌ ఫోన్‌ను ఇవ్వనున్నారు.


Nothing Phone 2 Specs: నథింగ్‌ ఫోన్‌ 2లో స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌ ఉంటుంది. నథింగ్‌ ఫోన్‌ 1 మిడ్‌ రేంజ్‌ ఆక్టా కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 778జీ+ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఫోన్‌ 1లో 6.55 అంగుళాల ఓఎల్‌ఈడీ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్‌ 778జీ+ చిప్‌సెట్‌ ఉంటుంది. ఈ ఫోన్‌లో వెనక వైపు రెండు 50 ఎంపీ, సెన్సార్లతో కూడిన కెమెరాలు ఉన్నాయి. 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, 33 వాట్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో పాటు 15 వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ కూడా ఇందులో ఉంది. ఇందులో నోటిఫికేషన్ల కోసం ఎల్‌ఈడీ లైట్‌ స్ట్రిప్‌లు అందుబాటులో ఉన్నాయి. 


Nothing Phone 2 Price: నథింగ్‌ ఫోన్‌ 1 8 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజీ మోడల్‌ ధర రూ.32,999గా ఉంది. ఈ ధరను విడుదల సమయంలో నథింగ్‌ కంపెనీ సీఈఓ కార్ల్‌ పే ప్రకటించారు. అయితేపలు ఆఫర్లు, డిస్కౌంట్ల తర్వాత ఈ ఫోన్ ధరలు తగ్గాయి. అయితే నథింగ్‌ ఫోన్‌ 2 ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాదాపుగా రూ.40,000 ఉండనుంది. పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో తెలియరానున్నాయి.   


Also Read: MS Dhoni vs Rohit Sharma: ఎంఎస్ ధోనీకి వచ్చిన పేరు రోహిత్‌ శర్మకు దక్కలేదు: గవాస్కర్  


Also Read: Pawan Kalyan Divorce : భార్యాభర్తల్ని కూడా విడదీస్తాడా!.. త్రివిక్రమ్‌పై బండ్ల గణేష్‌ కామెంట్స్?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.