Nothing Phone 2 with Qualcomm Snapdragon 8 series: కేవలం ఒకే ఒక్క స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అమెరికన్ టెక్ కంపెనీ నథింగ్ తన తదుపరి డివైజ్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ తదుపరి స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (2)ని విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు సహా CEO కార్ల్ పీ జనవరిలో చెప్పగా ఇప్పుడు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023 టెక్ ఈవెంట్‌లో, ఈ ఫోన్ కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్‌లను కార్ల్ స్వయంగా ధృవీకరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నథింగ్ ఫోన్ (2) ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో లాంచ్ చేయబడుతుందని, కాబట్టి దీని ధర ప్రస్తుత పరికరం కంటే ఎక్కువగా ఉండవచ్చు అని కార్ల్ పీ వెల్లడించాడు. ఇక కంపెనీ మొదటి ఫోన్ పారదర్శక డిజైన్ నథింగ్ ఫోన్ (1) గత సంవత్సరం Qualcomm Snapdragon 778G ప్రాసెసర్‌తో లాంచ్ చేశారు. కానీ రాబోయే నథింగ్ ఫోన్ (2) ఈ సంవత్సరం స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్‌తో వస్తుందని ఆయన నిర్ధారించారు.


ఇక కొత్త ఫోన్ పనితీరు పరంగా చాలా బాగుంటుందని అంటున్నారు. నథింగ్ ఫోన్ 2 స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 లేదా  స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మూడవ అవకాశం ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ప్రారంభించబడే కొత్త 8-సిరీస్ చిప్‌సెట్ కావచ్చని కూడా. ఇక ఫ్లాగ్‌షిప్ రేంజ్ ప్రాసెసర్‌తో కొత్త నథింగ్ ఫోన్ మునుపటి ఎంపిక కంటే పనితీరు పరంగా చాలా శక్తివంతమైనది అని ఖచ్చితంగా చెప్పవచ్చని అంటున్నారు.ఈ డివైజ్‌కి సంబంధించిన మరికొన్ని కీలక స్పెసిఫికేషన్‌లు కూడా లీక్ అయ్యాయి.
నథింగ్ ఫోన్ (2) స్పెసిఫికేషన్‌లు ఇలా ఉండే అవకాశం ఉంది. ఉంటాయి. 


నిజానికి ఈ నథింగ్ ఫోన్ (2) యొక్క ఏ ఫీచర్లను కంపెనీ అధికారికంగా ధృవీకరించలేదు, అయితే లీక్‌లు వల్ల కొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి.నథింగ్ ఫోన్ (2) మోడల్ నంబర్ A065 ఇటీవలి నివేదికలో కనిపించింది. ఈ ఫోన్ 12GB RAMతో 256GB స్టోరేజ్ తో వచ్చే అవకాశం ఉంది.  వర్చువల్ ర్యామ్ ఫీచర్‌తో వినియోగదారులు దాని ర్యామ్ సామర్థ్యాన్ని కూడా పెంచుకోగలుగుతారు. 5000 mAh బ్యాటరీ కాకుండా, ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లే కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.


మార్చిలో ఎలాంటి ప్రోడక్ట్ లాంచ్? 
తదుపరి నథింగ్ స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో మార్కెట్లో లాంచ్ అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది అమెరికా మార్కెట్‌పై నథింగ్  దృష్టి సారిస్తుందని కార్ల్ పేయ్ చెప్పారు, కాబట్టి భారతదేశంలో దాని లాంచ్ ఇంకా ధృవీకరించబడ లేదు. తన తదుపరి ప్రోడక్ట్ లాంచ్ మార్చిలో ఉంటుందని కంపెనీ తెలిపింది, అయితే ఈ ప్రోడక్ట్ ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇది ఆడియో డివైజ్ కావచ్చు లేదా వాచ్ కావచ్చని అంటున్నారు. 


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ కానుక, త్వరలో డీఏ, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపుపై కీలక ప్రకటన


Also Read; Yulu Bajaj EV Scooter: డెలివరీ బాయ్స్‌కు గుడ్‌ న్యూస్‌.. డెడ్‌ ఛీప్‌గా ఎలక్ట్రిక్‌ డెలివరీ స్కూటీ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి