Nothing Phone 3: ప్రముఖ అమెరికన్‌ టెక్‌ కంపెనీ నథింగ్‌ ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన 2(A) మోడల్‌కు మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ మొబైల్‌ అద్భుతమైన విజయం సాధించడంతో కంపెనీ త్వరలోనే మరో గుడ్‌ న్యూస్‌ తెలపబోతోంది. మార్కెట్‌లో యువతను దృష్టిలో పెట్టుకుని నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ లాంచింగ్‌కి ముందే ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్ అయ్యాయి. అయితే ఈ నథింగ్ ఫోన్ 3 మోడల్‌ యాపిల్‌ 15 ప్రో మోడల్‌ లాగా అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో యాక్షన్‌ బటన్‌ సెటప్‌ను కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే సోషల్‌ మీడియాలో నథింగ్ CEO కార్ల్ పీ ఈ నథింగ్ ఫోన్ 3 మొబైల్‌కి సంబంధించిన పోస్ట్‌ పెట్టారు. అందులో ఈ మొబైల్‌లో అందుబాటులోకి రాబోయే  సెట్టింగ్‌ల మెనుకు సంబంధించిన వివరాలను తెలిపారు. అంతేకాకుండా కొత్త యాక్షన్‌ బటన్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ కూడా కనిపించింది. ఈ బటన్‌ వినియోగించి వివిధ రకాల పనులను కూడా చేయోచ్చని పోస్ట్‌ ద్వారా తెలిపారు. దీంతో పాటు ఈ మొబైల్‌ అద్భుతమైన డిజైన్‌ కూడా కలిగి ఉంటుంది. 


యాక్షన్ బటన్ పనేంటి?
యాక్షన్ బటన్ అనేది విభిన్న పనులను ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఈ బటన్‌తో సులభంగా కెమెరాను కంట్రోల్‌ చేయడమే కాకుండా, Google అసిస్టెంట్‌ ఓపెన్‌, స్క్రీన్‌షాట్ తీయడం వంటి పనులను చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు ఎలాంటి పనులకైనా దీనిని వినియోగించుకునేందుకు ప్రత్యేకమైన ఆప్షన్‌ను అందిస్తోంది. అలాగే ఈ కొత్త నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని శక్తివంతమైన ఫీచర్స్‌ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి.  మార్కెట్‌లోకి ఈ మొబైల్‌ విడుదలైతే, దీని ధర దాదాపు రూ.30 వేల నుంచి రూ.40 వేల మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి. 


Also Read: Google Pay Close: అలర్ట్.. గూగుల్‌ పే సేవలు బంద్‌.. ఎందుకో తెలుసా?


నథింగ్ ఫోన్ 3 ఫీచర్స్‌:
హై-రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ డిస్‌ప్లే
6.5-అంగుళాల AMOLED డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
 12GB ర్యామ్‌, 256GB స్టోరేజ్‌ 


Also Read: Google Pay Close: అలర్ట్.. గూగుల్‌ పే సేవలు బంద్‌.. ఎందుకో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter