Oneplus 10 Pro 5G Price: ఫ్లిప్‌కార్ట్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సేల్‌ నడుస్తోంది.  ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎక్ట్రిక్‌ వస్తువులు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ క్రమంలో స్మార్ట్‌ ఫోన్స్‌ని కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌ లభించనుంది. అయితే OnePlus కంపెనీ ఇటీవలే లాంచ్‌ చేసి 10 Pro సిరీస్‌ మొబైల్‌పై ఈ సేల్‌లో ప్రత్యేక ఆఫర్‌ లభిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 71,999లకు లభిస్తోంది. అయితే స్వాతంత్ర్య దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్లిప్‌కార్ట్‌ తమ కస్టమర్స్‌కి ప్రత్యేక తగ్గిపును అందిస్తోంది. OnePlus 10 Pro 5G మొబైల్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే రూ. 66,499లకే లభిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌ కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేయాలనుకునేవారికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. OnePlus 10 Pro 5G మొబైల్‌ను HDFC క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఇదే బ్యాంక్‌ కార్డ్‌ను వినియోగించి EMI ఆప్షన్‌తో కొనుగోలు చేస్తే రూ. 3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 63,499లకే పొందవచ్చు.  HDFC క్రెడిట్‌ కార్డ్‌ లేని వారు ఆ బ్యాంక్‌ డెబిట్‌ కార్డ్‌ వినియోగించి కొనుగోలు చేసిన రూ. 1,000 వరకు తగ్గింపు పొందవచ్చు.


ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?


అమెజాన్‌లో కూడా ప్రత్యేక ఆఫర్‌:
ఇక అమెజాన్‌ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఈ OnePlus 10 Pro 5G మొబైల్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేస్తే బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ను కూడా లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ CICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 5,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ డిస్కౌంట్‌ పొందాలనుకునేవారు వన్‌ కార్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌ను కూడా వినియోగించవచ్చు. అదనపు డిస్కౌంట్‌ పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. అయితే మీ పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేస్తే రూ. 63,100 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ. 3,899లకే పొందవచ్చు.


OnePlus 10 Pro 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
✤ 80 W ఛార్జింగ్‌ సపోర్ట్‌ 
✤ Snapdragon 8 Gen 1 చిప్‌సెట్‌
✤ LTPO టెక్నాలజీ 3216x1440 పిక్సెల్ రిజల్యూషన్‌ డిస్‌ప్లే
✤ 6.7 అంగుళాలు డిస్‌ప్లే
✤ 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌ 
✤ 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
✤ 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా
✤ 8 మెగాపిక్సెల్ కెమెరా
✤ 5000mAh బ్యాటరీ
✤ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ 
✤ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
✤ 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ 
✤ Android 12 ఆధారిత ఆక్సిజన్ OS


ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి