OnePlus 11 5G: విభిన్న కలర్ తో OnePlus 11 5G స్మార్ట్ ఫోన్.. లుక్ అదుర్స్.. ధర వివరాలు ఇవే!
Oneplus 11 Marble Odyssey Price: మార్కెట్లో ఇటీవలే విడుదలైన OnePlus 11 5G స్మార్ట్ ఫోన్.. మరో కొత్త కలర్ లో కనిపించబోతోంది. ఈ కలర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు, లాంచింగ్ డేట్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus 11 Marble Odyssey Price: భారత మార్కెట్లో ఇటీవలే విడుదలైన ప్లస్ కంపెనీకి చెందిన OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ మరో కొత్త లుక్ లో కనిపించనుంది. భారత దేశంలో స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన మరో కొత్త రకమైన కలర్ తో కంపెనీ విడుదల చేయనుంది. OnePlus 11 5G ఫోన్ కొత్త మార్బుల్ ఒడిస్సీ రంగుతో లభించబోతోంది. కంపెనీ తన క్లౌడ్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా ఈ కొత్త రంగు స్మార్ట్ ఫోన్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రెండు కలర్లలో లభిస్తోంది. ఒకటి ఎటర్నల్ గ్రీన్ అయితే.. మరొకటి టైటాన్ బ్లాక్.. త్వరలోనే మార్బుల్ ఒడిస్సీ కలర్ కూడా రాబోతోందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కలర్ కు సంబంధించిన స్మార్ట్ ఫోన్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మార్బుల్ ఒడిస్సీ కలర్ స్మార్ట్ ఫోన్ విడుదల డేట్ అప్పుడే:
కొత్త మార్బుల్ ఒడిస్సీ కలర్ వేరియంట్ విడుదల తేదీ వన్ ప్లస్ కంపెనీ అధికారికంగా ఎక్కడ పేర్కొనలేదు. ఇటీవలే పలు అధికారిక ప్రకటనలలో త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు మాత్రం తెలిపింది. ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తే..16GB + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ తో లభించనుంది. ఇక ధర విషయానికొస్తే ధర రూ. 64,999తో మార్కెట్లో అందుబాటులో ఉండనుంది.
OnePlus 11 5G స్పెసిఫికేషన్‌లు:
✵ 6.7-అంగుళాల Quad-HD+(1,440×3,216 పిక్సెల్‌లు) 10-bit LTPO 3.0 AMOLED డిస్‌ప్లే
✵ 120Hz వరకు రిఫ్రెష్ రేట్
✵ 1000Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్
✵ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 13
✵ 50MP Sony IMX890 కెమెరా
✵ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ 48MP సోనీ IMX581 సెన్సార్ కెమెరా
✵ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC
✵ Adreno 740 GPU
✵ UFS 4.0 ఇన్‌బిల్ట్ స్టోరేజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , FacebooKమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి