OnePlus 11 features: OnePlus 11 గత ఏడాది లాంచ్ అయింది. ఈ ఫోన్ కొనాలంటే ఇదే మంచి అవకాశం. ఈ ఫోన్‌పై ఇప్పుడు ఏకంగా 5000 రూపాయలు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 11 ఫోన్ ధర తగ్గడం ఏడాది వ్యవధిలో ఇది రెండవసారి. 56,999 రూపాయలకు లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం 49,999 రూపాయలకే లభించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OnePlus 11 అనేది 6.7 ఇంచెస్ QHD+ LTPO 3 Fluid 120Hz AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 1300 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉండటమే కాకుండా క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌తో ఉంది.  ఈ ఫోన్ 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉండటం వల్ల అత్యంత వేగంగా పనితీరు ఉంటుంది. ఫోన్ హ్యాంగ్ అయ్యే ప్రసక్తే ఉండదు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. యధావిధిగా ఐదేళ్ల వరకూ సెక్యూరిటీ అప్‌డేట్స్, నాలుగేళ్ల వరకూ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ లభిస్తాయి. 


ఇక కెమేరా విషయానికొస్తే 3 కెమేరాసెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సార్ ప్రైమరీ కెమేరా, 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 581 అల్ట్రా వైడ్ సెన్సార్, 32 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్ కెమేరా ఉన్నాయి. ఇక వీడియో కాలింగ్ లేదా సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ప్రత్యేక కెమేరా ఉంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉండి 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 


ఇవి కాకుండా ఎలర్ట్ స్లైడర్, ఐపీ 54 రేటింగ్, డాల్బీ ఎట్మాస్, స్పెషల్ ఆడియో స్టీరియా స్పీకర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఏడాది వ్యవధిలో రెండుసార్లు తగ్గిన తరువాత  56,999 రూపాయల వన్‌ప్లస్ 11 ఫోన్ 49,999 రూపాయలకు లభించనుంది. ఇది కాకుండా వివిధ బ్యాంకుల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 


Also read: iPhone 13 Offers: అమెజాన్‌లో ఐఫోన్ 13 కేవలం 15 వేలకే, ఎలాగంటే



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook