Oneplus 13 5G Price: త్వరలోనే భారత మార్కెట్‌లోకి OnePlus వరల్డ్ క్లాస్ 5g స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ కాబోతోంది. ఈ మొబైల్ మార్కెట్‌లో పోటీ దారులకు పెద్ద తల నొప్పిగా మారబోతోంది. ఇంతకీ ఈ మొబైల్‌ ఏ సిరీస్‌లో వస్తుందో తెలుసా? వన్‌ప్లస్‌ కంపెనీ దీనిని OnePlus 13 5G సిరీస్‌లో విడుదల చేయబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు శక్తివంతమైన బ్యాటరీతో విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన కెమెరా సెటప్‌తో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ OnePlus 13 5G స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన 6.82-అంగుళాల ఫుల్‌ HD AMOLED డిస్‌ప్లేతో లాంచ్‌ కానుంది. ఇది ప్రీమియం స్క్రోలింగ్‌ అనుభాన్ని అందిస్తుంది. దీంతో పాటు ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో పాటు 2K రిజల్యూషన్‌ను కలిగి ఉంది. అలాగే క్రిస్టల్-క్లియర్ విజువల్స్‌ను అందించబోతున్నట్లు కంపెనీ టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా గేమింగ్‌లో మంచి అనుభాన్ని అందిచేందుకు ప్రత్యేకమైన రిజల్యూషన్‌ను అందిస్తుంది. దీంతో పాటు ఈ డిస్ల్పే  టాప్-టైర్ టెక్నాలజీని కూడా విడుదల చేయబోతోంది. 


ఇక ఈ OnePlus 13 5G స్మార్ట్‌ఫోన్‌  50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఇది అదనంగా మరో రెండు కెమెరా సెటప్‌లను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తుంది. అలాగే 4k వీడియో చిత్రీకరణ సామర్థ్యాన్ని అందిస్తుంది. అంతేకాకుండా LED ఫ్లాష్ లైట్‌ సెటన్‌ కూడా అందిస్తోంది. ఈ మొబైల్‌ ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌పై రన్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీని బేస్‌ వేరియంట్‌ 16GB ర్యామ్‌తో పాటు 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌తో విడుదల కాబోతోంది.  


Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  


బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ సపోర్ట్:
అన్ని మొబైల్‌ ఫోన్స్‌లా కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన బ్యాటరీ సెటప్‌తో విడుదల కానుంది. ఇందులోని బ్యాటరీ 5400mAhతో విడుదల కానుంది. అంతేకాకుండా ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే అద్భుతమైన శక్తిని అందించేందుకు ఇందులోని బ్యాటరీ ప్రీమియం మెటల్‌ను కలిగి ఉంటుంది. అయితే దీని ధర రూ.64,999 నుంచి విడుదల కానుంది. అంతేకాకుండా హై-ఎండ్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై కంపెనీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. 


Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.