OnePlus Ace 3 Pro: ఐఫోన్, శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లకు ఎంత క్రేజ్ ఉంటుందో వన్‌ప్లస్ ఫోన్లకు కూడా దాదాపుగా అంతే ఆదరణ లభిస్తుంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్లు, పవర్‌ఫుల్ కెమేరాతో ఫోన్లు లాంచ్ చేస్తుంటుంది. ఇప్పుడు తాజాగా 6100 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో లాంచ్ చేసిన ఫోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OnePlus మొదటిసారిగా 6100 ఎంఏహెచ్ కలిగిన సూపర్ బ్యాటరీతో OnePlus Ace 3 Pro లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇప్పుడు మార్కెట్‌లో సంచలనంగా మారింది. ఎందుకంటే బ్యాటరీ సామర్ధ్యం అత్యధికంగా ఉండటమే కాకుండా ర్యామ్ కూడా ఏకంగా 24 జీబీ వరకూ ఉండటం విశేషం. OnePlus Ace 3 Pro అనేది 6.78 ఇంచెస్‌తో 1.5 కే 3డి కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 4500 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 అమర్చింది కంపెనీ. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14  కలిగి ఉంటుంది. 


ఇక కనెక్టివిటీ పరంగా చూస్తే బ్లూటూత్ 5.4, వైఫై 7 ఉన్నాయి. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దాంతో కేవలం 30 నిమిషాల్లోనే 70-80 శాతం వరకూ ఛార్జ్ కాగలదు. ఈ ఫోన్ ఫీచర్లలో ప్రధానంగా చెప్పుకోవల్సింది ర్యామ్-స్టోరేజ్ గురించి. ఇందులో ఏకంగా 12 జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఉంది. ఇది కాకుండా 16జీబీ ర్యామ్‌తో 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఈ మూడింటికీ మించి 16 జీబీ ర్యామ్, 24 జీబీ ర్యామ్‌తో 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లు మరో రెండున్నాయి. అంటే ఫోన్ పనితీరు ఎంత వేగంగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు.


ఇక కెమేరా అయితే50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమేరా ఉంది. ఇందులో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర 36,700 రూపాయలుగా ఉంది. ఇతర వేరియంట్లు 40, 200 రూపాయల నుంచి గరిష్టంగా 50, 500 రూపాయల వరకూ ఉన్నాయి. 


Also read: FD Interest Rates: ఒక ఏడాది ఎఫ్‌డీపై ఏ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుందో చెక్ చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook